Share News

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి షాక్ ఇచ్చిన గన్నవరం పోలీసులు..

ABN , Publish Date - Mar 13 , 2025 | 08:06 PM

గన్నవరంలో తనపై నమోదైన రెండు కేసుల్లో నోటీసులు ఇచ్చి వివరణ తీసుకునేలా పోలీసులకు ఆదేశాలివ్వాలంటూ హైకోర్టును వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆశ్రయించారు. ఆ మేరకు ధర్మాసనం విచారణ చేపట్టగా ఇరువర్గాల తమ వాదనలు వినిపించాయి.

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి షాక్ ఇచ్చిన గన్నవరం పోలీసులు..
Former MLA Vallabhaneni Vamsi

అమరావతి: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)కి గన్నవరం పోలీసులు (Gannavaram Police) మరో షాక్ ఇచ్చారు. గన్నవరం, ఆత్కూర్ పోలీస్ స్టేషన్లలో నమోదైన రెండు కేసుల్లో పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ మేరకు గన్నవరం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు గన్నవరం పోలీసులు తనపై నమోదు చేసిన కేసులపై ఏపీ హైకోర్టు (AP High Court)ను వంశీ ఆశ్రయించారు.


బీఎన్ఎన్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకునేలా పోలీసులకు ఆదేశాలివ్వాలంటూ హైకోర్టులో రెండు పిటిషన్లు వేశారు. కాగా, ఇవాళ(గురువారం) ఈ పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది. రెండు కేసుల్లోనూ ఏడేళ్ల లోపు శిక్షకు వీలున్న సెక్షన్లు మాత్రమే ఉన్నాయని వంశీ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అందుకే నోటీసులు ఇచ్చి వివరణ మాత్రమే తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.


అయితే ఈ కేసుల్లో పోలీసులు అదనంగా మరికొన్ని సెక్షన్లు చేర్చారని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని కోరారు. ఈ మేరకు ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కాగా, ప్రస్తుతం బెదిరింపులు, కిడ్నాప్ కేసులో విజయవాడ జిల్లా జైలులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

YS Sharmila Reddy: డీలిమిటేషన్ అంటే దక్షిణాది రాష్ట్రాలపై ప్రతికారమే: వైఎస్ షర్మిల..

Fish and Mutton prices: బర్డ్ ఫ్లూ దెబ్బకు కొండెక్కిన మటన్, చేపల రేట్లు.. పరిస్థితి ఎలా ఉందంటే..

Updated Date - Mar 13 , 2025 | 08:11 PM