Share News

Perni Nani: అరెస్ట్‌కు రంగం సిద్ధం.. పరారీలో పేర్ని నాని, కిట్టు..!

ABN , Publish Date - Jun 11 , 2025 | 09:00 PM

నకిలీ ఇళ్ల పట్టాల కేసులో అరెస్ట్‌కు రంగం సిద్ధం కావడంతో పేర్ని నాని ఆయన కుమారుడు పేర్ని కిట్టు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Perni Nani: అరెస్ట్‌కు రంగం సిద్ధం.. పరారీలో పేర్ని నాని, కిట్టు..!
Perni Nani and Kittu

మచిలీపట్నం, జూన్ 11: నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో కీలక సూత్రధారి, మాజీ మంత్రి పేర్ని నానితోపాటు ఆయన కుమారుడు పేర్ని కిట్టు అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారిద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఎన్నికల ముందు ఓట్లు కోసం మచిలీపట్నంలో నకిలీ పట్టాలను పేర్ని నానితోపాటు పేర్ని కిట్టు పంపిణి చేసినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ప్రభుత్వాధికారులు విచారణ జరిపారు. దీనిలో వీరి ప్రమేయం ఉందని వారు నిర్ధారించారు.


త్వరలో వీరిద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టును పేర్ని నాని ఆశ్రయించారు. నకిలీ పట్టాల పంపిణీలో తన ప్రమేయం గానీ, తన కుమారుడు ప్రమేయం గానీ లేదని హైకోర్టులో పేర్ని నాని ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ గురువారం విచారణకు వచ్చే అవకాశముంది. సుమారు 10 వేలు నకిలీ పట్టాలను పంపిణీ చేసినట్లు పేర్ని నానిపై అభియోగం వినిపిస్తోంది.

ఇప్పటికి పేర్ని నానికి సంబంధించిన గోడౌన్‌లో బియ్యం బస్తాల గల్లంతు అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహరంలో ఆయన ఫ్యామిలీ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం విధితమే.


మరోవైపు గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికలకు ముందు ఆయన సైతం హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:


రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు

పీఎస్ఆర్ ఆంజనేయులుకు మధ్యంతర బెయిల్

For More AP News and Telugu News

Updated Date - Jun 11 , 2025 | 09:10 PM