Share News

PSR Anjaneyulu: పీఎస్ఆర్ ఆంజనేయులుకు మధ్యంతర బెయిల్

ABN , Publish Date - Jun 11 , 2025 | 07:12 PM

ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనం కేసులో అవకతవకల వ్యవహారంలో అరెస్టయిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులకు మధ్యంతర బెయిల్ లభించింది.

PSR Anjaneyulu: పీఎస్ఆర్ ఆంజనేయులుకు మధ్యంతర బెయిల్
PSR Anjaneyulu

విజయవాడ, జూన్ 11: ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనం కేసులో అవకతవకల వ్యవహారంలో అరెస్టయిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులకు మధ్యంతర బెయిల్ లభించింది. అనారోగ్యం కారణంగా ఆయనకు 14 రోజుల బెయిల్ మంజూరు చేసింది. పీఎస్ఆర్ ఆంజనేయులు అనారోగ్యానికి సంబంధించిన మెడికల్ రిపోర్టులను కోర్టుకు అందజేశారు.

హై బీపీతోపాటు గుండెకు సంబంధించిన సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆంజనేయులను హైదరాబాద్ తరలించనున్నారు. అయితే ప్రస్తుతం విజయవాడ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో పీఎస్ఆర్ ఆంజనేయులు చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.


ఏపీపీఎస్సీ గ్రూప్- 1 మూల్యాంకనంలో వ్యవహారంలో జరిగిన అవకతవకల్లో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుతోపాటు దాత్రి మధును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారిని వేర్వేరుగా విచారించారు. వీరిద్దరు విజయవాడ సబ్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే పీఎస్ఆర్ అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తులను పలు మార్లు కోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.


మరో వైపు పీఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్‌ను కోర్టు మళ్లీ పొడిగించింది. ఆయన రిమాండ్‌ను జూన్ 19వ తేదీ వరకు పొడిగించింది. అయితే పీఎస్ఆర్ ఆంజనేయులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో తనకు చికిత్స అవసరమంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు స్పందించింది. ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి.. నివేదికను కోర్టుకు సమర్పించారు. దాంతో పీఎస్ఆర్ ఆంజనేయులుకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి:


రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు

ఎమ్మెల్యే కోసం యువకులు వీరంగం.. ఎందుకంటే..

For More AP News and Telugu News

Updated Date - Jun 11 , 2025 | 09:01 PM