Share News

CM Chandrababu: గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

ABN , Publish Date - Nov 05 , 2025 | 07:54 PM

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌‌కు కర్ణాటక రాష్ట్ర న్యాయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మక డాక్టర్ ఆఫ్ లాస్ డిగ్రీని ప్రదానం చేసింది. ఈ సందర్భంగా గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.

CM Chandrababu: గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
CM Chandrababu Naidu

అమరావతి, నవంబర్ 05: కర్ణాటక రాష్ట్ర న్యాయ విశ్వవిద్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌‌ ప్రతిష్టాత్మక డాక్టర్ ఆఫ్ లాస్ డిగ్రీని అందుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ గౌరవం.. చట్టం, న్యాయం, ప్రజాసేవలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ చేసిన కృషిని ప్రతిబింబిస్తోందన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను సీఎం చంద్రబాబు అభినందనలతో ముంచెత్తారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. ఈ ఎక్స్ ఖాతాకు గవర్నర్ ఏపీ అంటూ ట్యాగ్ చేసి.. ఈ పోస్ట్ చేశారు.

AP-Governor.jpg


బుధవారం హుబ్లీలోని నవనగర్‌లో కర్ణాటక రాష్ట్ర న్యాయ విశ్వవిద్యాలయం.. ఏపీ గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ చేతుల మీదగా డాక్టర్ ఆఫ్ లాస్ డిగ్రీని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతోపాటు యూనివర్శిటీ అధికారులు పాల్గొన్నారు. గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అబ్దుల్ నజీర్ పని చేశారు. ఆ పదవి నుంచి రిటైర్ అయిన తర్వాత ఏపీ గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సూపర్ మూన్.. కనువిందు..

బాల సాహిత్య భేరి.. విద్యార్థులకు తానా కీలక సూచన

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 05 , 2025 | 08:49 PM