CM Chandrababu on IndiGo Crisis: ఇండిగో సంక్షోభంపై సీఎం చంద్రబాబు స్పందన.. ఏమన్నారంటే.?
ABN , Publish Date - Dec 08 , 2025 | 08:57 PM
ఇండిగో సంక్షోభం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. పైలట్లకు తగినంత విశ్రాంతినివ్వాలని చెప్పిన ఆయన.. ఇండిగో సంస్థ ప్రమాణాలను పాటించడంలో విఫలమైందన్నారు.
అమరావతి, డిసెంబర్ 08: దేశవ్యాప్తంగా ఇటీవల ఇండిగో సంక్షోభం(IndiGo Crisis)పై తీవ్ర చర్చ నడుస్తోంది. దీనిపై తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) స్పందించారు. ఇండిగో సంస్థలో పైలట్ల అంశాన్ని గురించి ప్రస్తావిస్తూ.. పైలట్లకు తగినంత విశ్రాంతి అవసరమని చెప్పారు. కానీ, ఇండిగో అలాంటి ప్రమాణాలేవీ పాటించలేదన్నారు. ఆ సంస్థకు ప్రత్యేకంగా సమయమిచ్చినా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు సీఎం. ఫలితంగా.. దేశవ్యాప్తంగా వందలకొద్దీ విమానాలు రద్దయ్యాయనీ.. వేల మంది ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు.
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఈ విషయమై.. ఇండిగో సంస్థ క్షమాపణలు చెప్పినప్పటికీ పరిస్థితులు ఇంకా అసౌకర్యంగానే ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం(Central Govt) రంగంలోకి దిగడంతో.. ఆ సంస్థ ఈ సంక్షోభం నుంచి మెల్లగా బయటపడుతోందన్నారు. అయితే.. ఈ విషయమై తాను మానిటరింగ్(Monitoring) చేయలేదని ముఖ్యమంత్రి చెప్పారు. సంబంధిత మంత్రి దీనిపై చర్చించి ప్రధాని, పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తారన్నారు. ఇండిగో మోనోపాలి(ఏకచ్ఛత్రాధిపత్యం) వల్లే ఈ సమస్యలు వచ్చినట్టు తెలుస్తోంది.
ఇవీ చదవండి: