Breaking News: ఉత్తరాంధ్ర వాసులకు కేంద్రం శుభవార్త..
ABN , Publish Date - Feb 05 , 2025 | 12:18 PM
Andhrapradesh: ఎన్నో ఏళ్ల ఉత్తరాంధ్ర వాసుల చిరకాల వాంఛ నెరవేరింది. ఉత్తరాంధ్రవాసులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. విశాఖపట్నం రైల్వే డివిజన్, విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలను కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
అమరావతి, ఫిబ్రవరి 5: ఉత్తరాంధ్ర వాసులకు కేంద్రం (Central Govt) పండగలాంటి వార్త చెప్పింది. విశాఖపట్నం రైల్వే డివిజన్, విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలను కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని తాజా ఉత్తర్వులు విడుదల చేసింది కేంద్రం. వాల్తేర్ డివిజన్ పేరును విశాఖపట్నం డివిజన్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. విశాఖ డివిజన్ పరిధిని కూడా మార్పు చేస్తూ తాజాగా ఉత్తర్వులు రిలీజ్ అయ్యాయి. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలోకి విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు రానున్నాయి.
రాయగడ రైల్వే డివిజన్ పరిధిని కూడా ఖరారు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ డివిజన్‌లో 410 కిలోమీటర్లు పరిధిని చేర్చారు రైల్వే అధికారులు. కొండపల్లి - మొటుమర్రి సెక్షన్‌ను సికింద్రాబాద్ డివిజన్ నుంచి విజయవాడ డివిజన్‌గా మారుస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.
ఎన్నో రోజులుగా ఉత్తరాంధ్ర వాసులకు చిరకాల వాంఛగా ఉన్న సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిని నిర్ణయించడంతో పాటు విశాఖ కేంద్రంగా విశాఖ రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పాటు విశాఖ రైల్వే డివిజన్ పరిధిలో మొత్తం 410 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ను చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. విశాఖ డివిజన్ పరిధిని కూడా మార్చింది కేంద్రం. విశాఖ డివిజన్ పరిధిలో ఏయే మార్గాలను చేరుస్తున్నారనే విషయాన్ని కూడా వెల్లడించింది కేంద్రం. అదే విధంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను మార్చారు.
విశాఖ రైల్వే డివిజన్‌లో పలాస నుంచి విశాఖపట్నం దువ్వాడ, కూలేరు నుంచి విజయనగరం, నవపాడు జంక్షన్ వరకు.. సింహాచలం నార్త్ నుంచి దువ్వాడ బైపాస్ వరకు.. వడ్లపూడి నుంచి దువ్వాడ-విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకు రైల్వే ట్రాక్ మొత్తం విశాఖ రైల్వే డివిజన్‌లోకి వస్తుందని కేంద్రం పేర్కొంది. రాయగడ రైల్వే డివిజన్‌లోని కొన్ని మార్గాలను విశాఖపట్నం రైల్వే డివిజన్ పరిధిలోకి తీసుకొచ్చారు. రెండు డివిజన్ల పరిధిని ఖరారు చేశారు. విశాఖ రైల్వే డివిజన్‌ను కొత్తగా ఏర్పాటు చేయడంతో సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలోకి దాన్ని మార్చేశారు. ఇంతకు ముందు గుంటూరు, గుంతకల్లు, విజయవాడ రైల్వే డివిజన్‌లు సౌత్ ఇంట్రన్ రైల్వే పరిధిలో ఉండేవి.. ఇప్పుడు వీటన్నింటినీ సౌత్ కోస్టల్ రైల్వే పరిధిలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం.
ఇవి కూడా చదవండి..
రెచ్చిపోతున్న పావురాళ్ల పందాల నిర్వాహకులు
తిరుమల వెళ్లేవారికి గుడ్‌న్యూస్ ..
Read Latest AP News and Telugu News