YS Sharmila: 11 మందితో వచ్చింది 11 నిమిషాల కోసమా.. జగన్‌పై షర్మిల ఆగ్రహం
ABN , Publish Date - Feb 24 , 2025 | 04:54 PM
YS Sharmila: ఏపీ అసెంబీలో వైఎస్సార్సీపీ వ్యవహార శైలిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ వచ్చింది అందుకేనా అంటూ వరుస ప్రశ్నలు సంధించారు.
అమరావతి, ఫిబ్రవరి 24: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (APCC Chief YS Sharmila) మరోసారి విరుచుకుపడ్డారు. ఏపీ అసెంబ్లీలో జగన్, వైసీపీ సభ్యుల తీరుపై విమర్శలు గుప్పిస్తూ.. పలు ప్రశ్నలు సంధించారు. ఇక జనాలు ఛీ కొడుతున్నా వైసీపీ అధ్యక్షులు జగన్ తీరు మాత్రం మారలేదని విమర్శించారు. 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండటానికా అసెంబ్లీకి వచ్చింది అని ప్రశ్నించారు. ప్రజా సమస్యల కన్నా తమకు ప్రతిపక్ష హోదానే ముఖ్యమా అని నిలదీశారు. ‘‘సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతో అటెండెన్స్ కోసం వచ్చారా? - కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి మీకు ప్రతిపక్ష హోదానే కావాలా ?’’ అంటూ వరుస ప్రశ్నలు వేశారు.

ప్రజల శ్రేయస్సుకంటే.. వైసీపీకి పదవులే ముఖ్యమని అసెంబ్లీ సాక్షిగా నిరూపించుకున్నారన్నారు. వైసీపీ సభ్యులకు పదవులు ముఖ్యం కాదు అనుకుంటే.. ప్రజాసమస్యల మీద చిత్తశుద్ది ఉంటే .. మంగళవారం నుంచి అసెంబ్లీకి వెళ్ళాలని కోరుతున్నామన్నారు. సభకు వెళ్ళే దమ్ము లేకపోతే తక్షణం పదవులకు రాజీనామాలు చేయాలని మరోసారి ఏపీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు.
Vamshi Case: వంశీ కేసులో విజయవాడ కోర్టు కీలక ఆదేశాలు

ఏపీ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంపై షర్మిల మాట్లాడుతూ... గవర్నర్ ప్రసంగంలో పసలేదని... దిశా-నిర్దేశం అంతకన్నా లేదన్నారు. అన్ని అర్థసత్యాలు, పూర్తి అబద్ధాలు అని వ్యాఖ్యలు చేశారు. సూపర్ సిక్స్ హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన లేదన్నారు. సంక్షేమం, పునరుజ్జీవనం అంటున్నారే కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో క్లారిటీ లేదని అన్నారు. ఇచ్చిన గ్యాస్ సిలిండర్ తప్పా మిగతా 5 హామీలపై స్పష్టత లేదని విమర్శించారు. మనుషులు, వనరులు, చేపలు అంటూ సామెతలు చెప్పారు తప్పిస్తే.. బాబు విజన్ 2047కు దమ్ము లేదంటూ కామెంట్స్ చేశారు. 8 నెలల పాలన కాలయాపన తప్పా ఎక్కడా కమిటిమెంట్ కనిపించలేదని దుయ్యబట్టారు. హామీల అమలు కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు గవర్నర్ ప్రసంగం తీవ్ర నిరాశను మిగిల్చిందన్నారు.
రూ.6.5లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి ఎక్కడొచ్చాయని.. 4 లక్షల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎవరికిచ్చారని ప్రశ్నించారు. తొలి సంతకం పెట్టిన డీఎస్సీకి అసలు నోటిఫికేషన్ అయినా ఇచ్చారా అని నిలదీశారు. ఆరోగ్య శ్రీ బకాయిలు ఎప్పుడు చెల్లించారని అడిగారు. కొత్త సీసాలో పాత సారా అనే సామెత లెక్క కూటమి మ్యానిఫెస్టోనే గవర్నర్ చదివారు తప్పిస్తే.. కొత్త అంశాలు ఒక్కటి లేవని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు.
ఇవి కూడా చదవండి...
Somireddy: ఆ భయంతోనే అసెంబ్లీకి జగన్
Read Latest AP News And Telugu News