Tulasi Babu: తులసిబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా
ABN , Publish Date - Jan 17 , 2025 | 01:27 PM
Andhrapradesh: రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో రఘురామ ఇంప్లీడ్ పిటిషన్ వేయగా.. అందుకు న్యాయస్థానం అనుమతించింది.

అమరావతి, జనవరి 17: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై (AP Deputy Speaker Raghurama Krishnam Raju) థర్డ్ డిగ్రీ ప్రయోగం కేసులో అరెస్ట్ అయిన కామేపల్లి తులసి బాబు బెయిల్ పిటిషన్‌పై ఈరోజు (శుక్రవారం) హైకోర్ట్‌లో (AP Highcourt) విచారణ జరిగింది. ఇందులో తమను కూడా ప్రతివాదిగా చేర్చుకోవాలని రఘురామ కృష్ణంరాజు వేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను ధర్మాసనం అనుమతించింది. ఆర్‌ఆర్‌ఆర్ ఇంప్లీడ్ పిటిషన్ తరపున న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. తులసి బాబుకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
రఘురామ కృష్ణం రాజుపై థర్డ్ డిగ్రీ చేసిన వ్యవహారంలో అతనికి సంబంధం లేదని, దీనికి సంబంధించి ప్రాసిక్యూషన్ కూడా ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయిందని తులసి బాబు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రభుత్వ తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. తులసిబాబు పోలీసు కస్టడీలో ఎటువంటి వివరాలు వెల్లడించలేదని, అందువల్ల పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ప్రస్తుతం సెషన్స్ కోర్ట్‌లో పెండింగ్‌లో ఉందని చెప్పారు. కస్టడీ పిటిషన్‌పై రేపు విచారణ ఉందని కోర్ట్‌కు వివరించారు. ఈ క్రమంలో ఈ కేసును సోమవారానికి (జనవరి 20)కి వాయిదా వేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. దీంతో ఈకేసు విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
Kaushikreddy: కావాలనే కేసులు.. విచారణ తర్వాత కౌశిక్ రెడ్డి కామెంట్స్
కాగా.. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రైవేటు వ్యక్తి అయిన తులసిబాబును ఈనెల 8న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు విచారణ జరిపిన పోలీసులు ఆపై అరెస్ట్ చేశారు. ఈ కేసులో పోలీసు కస్టడీలో ఉన్న రిటైర్డ్ ఏఎస్పీ విజయ్‌పాల్‌ను తులసి బాబును ఒకే చోట కూర్చోబెట్టి ప్రశ్నలు సంధించారు. అనంతరం విజయ్‌పాల్‌ను పంపించి వేసి తులసి బాబు ప్రత్యేకంగా విచారించారు. ఈ క్రమంలో కొంత మేర సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. అయితే పోలీసుల విచారణకు సహకరించకపోవడంతో పాటు బలమైన ఆధారాలు ఉండటంతో తులసిబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి...
స్టాక్ మార్కెట్.. వరుస లాభాలకు బ్రేక్..
మీ కళ్లు ఎంతో షార్ప్ అయితేనే..
Read Latest AP News And Telugu News