Raghurama Krishnam Raju: విద్యా విధానంలో నూతన ఒరవడికి మంత్రి లోకేశ్ శ్రీకారం..
ABN , Publish Date - Nov 09 , 2025 | 08:16 PM
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి ప్రతిభ ఆధారంగా ఢిల్లీ వెళ్లిన 52 మంది విద్యార్థులు ఇవాళ(ఆదివారం) తిరిగి వచ్చారు. విద్యార్థులను ఎంపిక చేసి మూడు రోజులు పాటు ఢిల్లీ పర్యటనకు పంపిన మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కృతజ్ఞతలు తెలిపారు.
కృష్ణా: ఢిల్లీ వెళ్లిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి ప్రతిభ ఆధారంగా ఢిల్లీ వెళ్లిన 52 మంది విద్యార్థులు ఇవాళ(ఆదివారం) తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ.. 52 మంది విద్యార్థులను ఎంపిక చేసి మూడు రోజులు పాటు ఢిల్లీ పర్యటనకు పంపిన మంత్రి నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విద్యా విధానంలో నూతన ఒరవడికి లోకేశ్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఈ యాత్ర విద్యార్థుల మనోవికాసానికి ఎంతో దోహదపడుతుందని వివరించారు. నిధులు కొరత ఉన్నప్పటికీ విద్య వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్న వ్యక్తి మంత్రి నారా లోకేశ్ అని కొనియాడారు. విద్యార్థులు ఏ కోర్స్ చదివితే వెంటనే ఉద్యోగాలు వస్తాయనే దానిపై లోకేశ్ దృష్టి పెడుతున్నారని చెప్పారు. విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసం ఈ యాత్ర తొలి అడుగని ఆయన స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో సమగ్ర శిక్ష అభియాన్ కోఆర్డినేటర్ కల్పన మాట్లాడుతూ.. నాసా ఇంటర్నేషనల్ సైన్స్ ఇంజనీర్లతో విద్యార్థులను ఇంట్రాక్షన్ చేయించినట్లు తెలిపారు. రాకెట్ తయారు చేసే విధానం, లాంచ్ చేసే విధానాన్ని చూసి విద్యార్థులు గొప్ప అనుభూతి పొందారని పేర్కొన్నారు. ఇస్రో అధికారులు విద్యార్థులతో తమ అనుభవాలను పంచుకున్నారని ఆమె చెప్పారు.
అనంతరం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేశినేని వెంకటేశ్వర్లు మాట్లాడారు.. తొలిసారి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లు పేద, మధ్యతరగతి పిల్లలను విమానం ఎక్కించారని తెలిపారు. రాష్ట్ర స్థాయి గురించి చర్చించుకునే విధంగా ఈ విమాన ప్రయాణం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
కర్ణాటకలో నాయకత్వ పోరుపై బీజేపీ పేరడీ వీడియో
హిందూ ధర్మం కూడా ఎక్కడా నమోదు చేసుకోలేదు.. ఆర్ఎస్ఎస్ చట్టబద్ధతపై మోహన్ భాగవత్