Ap Smart Ration Cards: బిగ్ అలర్ట్.. రేషన్ కార్డులు ఉన్నవారికి మూడు రోజులే ఛాన్స్..
ABN , Publish Date - Dec 10 , 2025 | 06:44 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ పంపిణీ విషయంలో పారదర్శకత కోసం స్మార్ట్ కార్డులను అందిస్తోంది. క్యూఆర్‌తో కూడిన స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ ఆగష్టు నుంచి జరుగుతున్నప్పటికీ ఇంకా వేల మంది తీసుకోలేదు. దీనిపై ప్రభుత్వం మరోసారి ప్రజలను అలర్ట్ చేసింది.
అమరావతి, డిసెంబర్ 10: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ది, సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. రేషన్ కార్డులు, రైస్ పంపిణీ విషయంలో కొత్త సంస్కరణలు తీసుకొస్తోంది. ముఖ్యంగా రేషన్ పంపిణీ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పారదర్శకత కోసం స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది. క్యూఆర్‌తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను ఆగష్టు నుంచీ పంపిణీ చేస్తోంది. అయితే.. చాలామంది ఇప్పటివరకు ఈ కార్డులను తీసుకోలేదు. దీంతో ఈనెల 15 లోగా కార్డులు తీసుకోవాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. గడువులోగా తీసుకోకపోతే మిగిలిన కార్డులను కమిషనరేట్‌కు తిరిగి పంపిస్తారని అధికారులు స్పష్టం చేశారు. దీంతో పలువురు రేషన్ కార్డుదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని.. కార్డులు కావాల్సిన వాళ్లు దగ్గరలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో రూ.200 చెల్లించి.. తమ పూర్తి అడ్రస్ ఇచ్చి దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని అధికారులు తెలిపారు. స్మార్ట్ కార్డులను కమిషనరేట్ నుంచి నేరుగా ఇంటి అడ్రస్‌కు పంపుతారు.
ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో డీలర్ల వద్ద ఉన్న రేషన్ కార్డుల్లో మృతిచెందిన వారు, వలస వెళ్లినవారి కార్డులు అలాగే మిగిలిపోయాయని అధికారులు చెప్పారు. వారి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని.. త్వరలో ఆయా స్మార్ట్ కార్డులను పరిశీలించి రద్దు చేస్తామన్నారు. రేషన్ డీలర్.. స్మార్ట్ కార్డుని స్కాన్ చేయగానే లబ్ధిదారుడి కుటుంబానికి సంబంధించి పూర్తి వివరాలు, ఫొటోలతో పాటు అడ్రస్, రేషన్ దుకాణా వివరాలు వస్తాయి. బయోమెట్రిక్ పనిచేయకపోతే ఐరిస్ ద్వారా స్కాన్ చేస్తారు. స్మార్ట్ కార్డుల ద్వారా ఎలాంటి అవకతవకలు జరగకుండా రేషన్ పంపిణీ పారదర్శకంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికి స్మార్ట్ కార్డుల పంపిణీ విషయంలో ఏపీ సర్కార్ పూర్తి క్లారిటీ ఇచ్చింది. లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
ఇవీ చదవండి: