AP EDCET 2025: ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి..
ABN , Publish Date - Jun 20 , 2025 | 02:53 PM
AP EDCET 2025: ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలను మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేశారు.
అమరావతి, జూన్ 20: ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు (AP EDCET 2025 Result) విడుదలయ్యాయి. ఈరోజు (శుక్రవారం) విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఈ ఫలితాలను సోషల్ మీడియా ఎక్స్ వేదికగా విడుదల చేశారు. గణితం, భౌతిక శాస్త్రాలు, సామాజిక అధ్యయనాలు, జీవశాస్త్రం, ఇంగ్లీష్ ఇలా మొత్తం ఐదు విభాగాల్లో 99.42 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. మొత్తం 17,795 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 14,527 మంది అర్హత సాధించారని మంత్రి వెల్లడించారు.
ర్యాంక్ కార్డులను https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_GetRankCard.aspx లో చూసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్‌టికెట్ నెంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి ర్యాంక్ కార్డును తెలుసుకోవచ్చు. అలాగే మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలను పొందే అవకాశాన్ని కల్పించింది సర్కార్. ముందుగా ఏపీ వాట్సప్ నంబర్‌కు హాయ్ మెసేజ్ చేయాలి.. తరువాత సెలక్ట్ సర్వీస్‌లో విద్యాసేవలు ఆప్షన్‌ను ఎన్నుకోవాలి. అందులో ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలపై క్లిక్ చేసి.. హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్‌ను ఎంటర్ చేసిన వెంటనే ఫలితాలు, ర్యాంక్ కార్డు వచ్చేస్తుంది.
ఇక.. ఏపీ ఎడ్‌సెట్ ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో మంత్రి పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
ఏపీకి కాగ్నిజెంట్.. 99 పైసలకే భూ కేటాయింపు
మా ప్రస్తావన అనవసరం.. జగన్‌పై కమ్మ సంఘాల ఆగ్రహం
నేరపూరిత స్వభావం కలిగిన వ్యక్తి జగన్.. ఎమ్మెల్యే ఆగ్రహం
Read Latest AP News And Telugu News