Share News

AP Cyclone Alert: భారీ వర్షాలు.. అధికారులకు మంత్రి ఆదేశాలివే

ABN , Publish Date - Oct 03 , 2025 | 10:50 AM

వాయుగుండం ప్రభావం తగ్గిన తరువాత ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంటుందని, అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

AP Cyclone Alert: భారీ వర్షాలు.. అధికారులకు మంత్రి ఆదేశాలివే
AP Cyclone Alert

అమరావతి, అక్టోబర్ 3: వ్యవసాయ, హార్టికల్చర్ ఉన్నతాధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) ఈరోజు (శుక్రవారం) టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒడిశా గోపాల్ పూర్ దగ్గర తీవ్ర వాయుగుండం పరిస్థితిపై అధికారులను మంత్రి అప్రమత్తం చేశారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో వ్యవసాయ, హార్టికల్చర్ పంటల నష్టాన్ని ప్రాథమిక అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఇతర జిల్లాల వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులను, సిబ్బందిని ఉపయోగించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.


వాయుగుండం ప్రభావం తగ్గిన తరువాత ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంటుందని, అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురవడంతో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. కాల్వలు, చెరువులకు గండ్లు పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల ఇరిగేషన్ అధికారులకు మంత్రి ఆదేశించారు. విద్యుత్, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు.


కాగా.. పార్వతీపురం మన్యం జిల్లాలో ఒరిస్సా లో కురుసు కురుస్తున్న భారీ వర్షాలతో నాగావళి నదికి వరద పోటెత్తింది. కొమరాడ మండలం కల్లికోట, మాదలింగ తదితర గ్రామాలను వరద ప్రవాహం చుట్టుముట్టింది. నాగావళి నదీ పరివాహక ప్రాంత ప్రజానీకాన్ని ఎప్పటికీ అప్రమత్తం చేశామని.. నష్టపోయిన రైతాంగాన్ని, నిర్వాసితులను అన్ని విధాల ఆదుకోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని మంత్రి సంధ్యారాణి వెల్లడించారు.


అలాగే శ్రీకాకుళం జిల్లా వంశధార నది పరీవాహక ప్రాంతంలో దిగువున ఉన్న గ్రామ ప్రజలకు రెండవ ప్రమాద హెచ్చరిక చేసినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. వంశధార నదికి 83,258 క్యూసెక్కుల నీరు వస్తోందని.. లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేయాలని కలెక్టర్ స్వప్నిల్ ఆదేశించారు.


ఇవి కూడా చదవండి...

రెండు భారీ చోరీలు.. ఆందోళనలో ప్రజలు

బావను రోడ్డుపై పరిగెత్తించిన మరీ చంపేసిన బావమరుదులు..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 03 , 2025 | 11:18 AM