AP News: అమిత్ షాతో భేటీ అయిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Apr 22 , 2025 | 02:05 PM
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. మంగళవారం చంద్రాబాబు రాష్టానికి సంబంధించి పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రులను కలిసి చర్చలు జరుపుతున్నారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఢిల్లీ (Delhi)లో పలువురు కేంద్ర మంత్రులను (Central ministers) కలుస్తూ బిజీ బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులతో రాష్టానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చిలు (Key Development Issues) జరుపుతున్నారు. మంగళవారం ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి అంశాలపై చర్చలు జరిపారు.
Also Read..: ఇంటర్ ఫలితాలు విడుదల..
అంతకుముందు కేంద్ర జల శక్తి మంత్రి సిఆర్ పాటిల్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు, నిధులు ఇతర అంశాలపై సుదీర్ఘంగా ఆయనతో చర్చించారు. సిఆర్ పాటిల్‌తో భేటీ అనంతరం కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మెగావాల్‌తో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ భేటీలో బాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు,పెమ్మసాని, ఏపీ ఎంపీలు పాల్గొన్నారు. తర్వాత కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో చంద్రబాబు భేటి అయ్యారు. ఏపీ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చలు జరిపారు. దాదాపు గంటపాటు పీయూష్ గోయల్‌తో చంద్రబాబు చర్చలు జరిపారు.
చంద్రబాబుకు ఘన స్వాగతం
కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఢిల్లీ విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి తన అధికారిక నివాసం 1 జన్‌పథ్‌కు చేరుకుని, రాత్రి అక్కడే బస చేశారు. మంగళవారం ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలుస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు ఘనస్వాగతం లభించింది. కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, టీడీపీ పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వారికిి స్వాగతం పలికారు. అప్పలనాయుడు, ఆయన సతీమణి ప్రభా నాయుడు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులు..
హైదరాబాద్ మియాపూర్‌లో దారుణం..
లిక్కర్ డాన్‌ను విచారిస్తున్న సిట్ అధికారులు..
For More AP News and Telugu News