Payyavula: జగన్‌పై విరుచుకుపడ్డ మంత్రి పయ్యావుల
ABN , Publish Date - Jan 04 , 2025 | 04:47 PM
Andhrapradesh: వచ్చిన ఐదు నెలల్లోనే తాము పోలవరం కోసం చేసిన దానిలో ఐదు శాతమైనా జగన్ పోలవరం నిర్మాణానికి చేశారా అని మంత్రి పయ్యావుల ప్రశ్నించారు. పోలవరం ముంపు గ్రామాలు వరద ముంపునకు గురైనప్పుడు నిర్వాసితుల బాధలు సీఎం కళ్లారా చూశారని తెలిపారు. పోలవరం ఏ ఒక్క ప్రాంతానికో వరం కాదని.. రాష్ట్ర రైతాంగానికి ఇదో గొప్ప వరం అని పేర్కొన్నారు.

అమరావతి, జనవరి 4: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jagan) ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavual Keshav) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కన్న తల్లికి దణ్ణం పెట్టలేని జగన్ తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తొమ్మిది వేల మంది పోలవరం నిర్వాసితులకు దాదాపు వెయ్యి కోట్లు ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సీఎం చంద్రబాబు నాయుడు సూచనలతో విడుదల చేశామని చెప్పారు. ఎన్నో ఇతర ప్రాధాన్యాలు పక్కన పెట్టి మరీ పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించామన్నారు. వచ్చిన ఐదు నెలల్లోనే తాము పోలవరం కోసం చేసిన దానిలో ఐదు శాతమైనా జగన్ పోలవరం నిర్మాణానికి చేశారా అని ప్రశ్నించారు. పోలవరం ముంపు గ్రామాలు వరద ముంపునకు గురైనప్పుడు నిర్వాసితుల బాధలు సీఎం కళ్లారా చూశారని తెలిపారు. పోలవరం ఏ ఒక్క ప్రాంతానికో వరం కాదని.. రాష్ట్ర రైతాంగానికి ఇదో గొప్ప వరం అని పేర్కొన్నారు.
రాయలసీమ భూ భాగంలో పట్టిసీమ తర్వాత గణనీయ మార్పులు వచ్చాయన్నారు. రైతు కష్టాలు తీరుస్తూ ధాన్యం కొనుగోళ్లు చేసిన 24 గంటల్లోనే నిధులు జమ చేస్తున్నామన్నారు. ప్రాజెక్టుల్లో నీళ్లు నింపి రైతుల జీవితాల్లో వెలుగులు చూస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందనే ఆతృత జగన్‌కు అనవసరమన్నారు. అనర్హులు పేరిట ఫింఛన్ల తొలిగింపు అని జరుగుతున్న ప్రచారం జగన్ శ్రేణులు సృష్టించిందే అని మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
హైడ్రా మరో కీలక నిర్ణయం.. ఇక వారిలో వణుకే
రూరల్ ఇండియా మహోత్సవ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
Read Latest AP News And Telugu news