Share News

AP News: సీఎం అయ్యాక తొలిసారి విదేశీ పర్యటనకు బయలుదేరిన చంద్రబాబు.. ఎందుకంటే..

ABN , Publish Date - Jan 19 , 2025 | 09:31 PM

అమరావతి: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(WEF) సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌(Davos)కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పయనమయ్యారు. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు ఢిల్లీ (Dehli) విమానం ఎక్కనున్నారు.

AP News: సీఎం అయ్యాక తొలిసారి విదేశీ పర్యటనకు బయలుదేరిన చంద్రబాబు.. ఎందుకంటే..
CM Chandrababu Naidu

అమరావతి: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(WEF) సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌(Davos)కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పయనమయ్యారు. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు మరికాసేపట్లో ఢిల్లీ (Dehli) విమానం ఎక్కనున్నారు. దేశ రాజధానికి చేరుకున్న అనంతరం రాత్రి 1:30 గంటలకు జ్యూరిచ్‌కు బయలుదేరుతారు. సోమవారం ఉదయం జ్యూరిచ్‌(Zurich)కు చేరుకుని బిజినెస్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు సమావేశం అవుతారు. అనంతరం హయత్ హోటల్‌లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత రోడ్డుమార్గంలో జ్యూరిచ్ నుంచి దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు వెళ్తారు.


దావోస్ చేరుకున్న అనంతరం సీఎం చంద్రబాబు అక్కడ బ్రాండ్ ఏపీ ప్రమోషన్‌తో రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే ప్రధాన ధ్యేయంగా చర్చలు జరుపుతారు. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా నాలుగు రోజులపాటు పలువురిని చంద్రబాబు మీట్ అవ్వనున్నారు. కాగా, సీఎం వెంట గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అధికారులు ఆల్ ది బెస్ట్ చెప్పారు. దావోస్ పర్యటన విజయవంతం కావాలని, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, సీఎంవో అధికారులు ఆకాంక్షించారు. దీంతో వారికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. కాగా, 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచి తొలిసారిగా సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

CM Chandrababu: యువనేత రాకేశ్ చౌదరి మృతి తీవ్రంగా కలచి వేసింది: సీఎం చంద్రబాబు..

Minister Gottipati: వైసీపీ అధినేత జగన్‌పై నిప్పులు చెరిగిన మంత్రి గొట్టిపాటి.. విషయం ఇదే..

Updated Date - Jan 19 , 2025 | 09:54 PM