Share News

Ram Prasad On Ambedkar Statue Fire: అంబేద్కర్ విగ్రహానికి నిప్పు ఘటనపై మంత్రి మండిపల్లి ఏమన్నారంటే

ABN , Publish Date - Oct 03 , 2025 | 02:55 PM

ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారని.. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు.

Ram Prasad On Ambedkar Statue Fire: అంబేద్కర్ విగ్రహానికి నిప్పు ఘటనపై మంత్రి మండిపల్లి ఏమన్నారంటే
Ram Prasad On Ambedkar Statue Fire

అమరావతి, అక్టోబర్ 3: చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనపై జిల్లా ఇంచార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Minster Mandipalli Ramprasad Reddy) ఆరా తీశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు మంత్రి. వెదురుకుప్పం మండలం, దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహానికి మంటలు అంటుకున్న ఘటన బాధాకరమన్నారు. ఘటనకు కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారని.. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు.


శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. దెబ్బతిన్న చోట నూతన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

దసరా ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రిపై అరుదైన రికార్డ్

మలేషియా ప్రతినిధులతో నారాయణ కీలక భేటీ

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 03 , 2025 | 03:04 PM