Krishna District Tragedy: బాలుడి ప్రాణం తీసిన అపనింద
ABN , Publish Date - Dec 03 , 2025 | 09:47 AM
ఒక అపనింద పదో తరగతి చదువుతున్న బాలుడి ప్రాణం తీసింది. తమ బిడ్డ విగత జీవిగా ఉండటం చూసి.. ఆ బాలుడి తల్లిదండ్రులు భోరున విలపించారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పామర్రులో చోటుచేసుకుంది.
కృష్ణా జిల్లా, డిసెంబర్02: పిల్లల మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే వారిని ఏ చిన్న మాట అన్నా.. చాలా బాధపడుతుంటారు. కొందరు పిల్లలు అయితే దారుణ నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకొందరు అయితే తాము చేయని తప్పుకు నిందలు పడ్డామనే బాధతో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలో ఘోరం జరిగింది. అపనింద కారణంగా ఓ చిన్నారి ప్రాణం(student tragic ) పోయింది. క్షణికావేశంలో ఆ బాలుడు తీసుకున్న నిర్ణయం అతడి కుటంబంలో విషాదం నింపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పామర్రు మండలం యడదిబ్బ గ్రామంలో కైలే యశ్వంత్ అనే 15 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దొంగతనం ఆరోపణతో యశ్వంత్ ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. తమ ఇంట్లో రూ.1500 కాజేసాడంటూ పొరుగింట్లో ఉండేవాళ్లు బాలుడిపై ఆరోపణలు(false theft accusation) చేశారు. తమ ఇంట్లో ఏది పోయిన నీదే బాధ్యత అంటూ బాలుడికి బెదిరించినట్లు సమాచారం. పొరుగింటి వారి బెదిరింపులతో యశ్వంత్ భయాందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో యశ్వంత్ ఆత్మహత్య చేసుకున్నాడు.
బాలుడు(Krishna district student) జమీదగ్గుమిల్లి హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. విగత జీవిత పడుకున్న యశ్వంత్ భౌతిక కాయాన్ని చూసి తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. ఇటీవల ఓ ప్రాంతంలో ఆరో తరగతి చదువుతున్న చిన్నారి కూడా పాఠశాలలోని మూడవ ఫ్లోర్ నుంచి దూకి చనిపోయింది. క్లాస్ లో తనను హేళన చేస్తున్నారనే కారణంతో ఈ దారుణ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ఘటనతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఇవి కూడా చదవండి:
ఆ వార్తలన్నీ అవాస్తవం.. ఇప్పట్లో స్మృతి పెళ్లి జరగదు!
ఆ ఫార్మాట్‌లోనూ ఆడే సత్తా ఉంది: తిలక్ వర్మ