Bifurcation Issue: కీలక సమావేశం... విభజన అంశాలపై కేంద్రం ఏం తేల్చనుంది
ABN , Publish Date - Feb 03 , 2025 | 03:05 PM
Bifurcation Issue: విభజన అంశాలపై చర్చించేందుకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా పరిష్కారం కాని ప్రధాన అంశాల పరిష్కారంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. విభజన చట్టం 9, 10 షెడ్యూల్‌లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్‌ల విభజన, వాటి ఆస్తులు, అప్పుల పంపకాలపై చర్చించనున్నారు.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన (AP, Telangana division Issue) అంశాల అమలు, తీరుతెన్నులపై కేంద్ర హోంశాఖలో (Union Home Ministry) సోమవారం కీలక సమావేశం జరిగింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఈ భేటీ జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా పరిష్కారం కాని ప్రధాన అంశాల పరిష్కారంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. విభజన చట్టం 9, 10 షెడ్యూల్‌లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్‌ల విభజన, వాటి ఆస్తులు, అప్పుల పంపకాలపై చర్చించనున్నారు. ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, చట్టంలో పేర్కొన్న మరికొన్ని సంస్థల విభజనపై చర్చ జరిగే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ప్రత్యేక అంశాలుః
గ్రేహౌండ్స్ కేంద్రం ఏర్పాటు
కొత్త రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహకారం,
వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి గ్రాంటు,
కేంద్ర సాయం తర్వాత కూడా ఉన్న రెవెన్యూ లోటు భర్తీ,
పోలవరం ప్రాజక్టు నిర్మాణం
13 షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థలు, మౌలిక వసతులు ప్రాజక్టుల
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు
దుగరాజపట్నం పోర్టు నిర్మాణం
కడప జిల్లాల్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు
పెట్రోలియం రిఫైనరీ, ప్రెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు
కొత్త రాజధాని నుంచి హైదరాబాద్ సహా ప్రధాన నగరాలకు రోడ్ల అనుసంధానం, ర్యాపిడ్ రైలు కనెక్టివిటీ
ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ తరహాలోనే విశాఖ-చెన్నై కారిడార్ ఏర్పాటు.
విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా విస్తరణ,
కొత్త రైల్వే జోన్ ఏర్పాటు
విశాఖపట్నం, విజయవాడ-గుంటూరు-తెనాలి మెట్రో రైలు నిర్మాణం
తెలంగాణకు సంబంధించిన ప్రత్యేక అంశాలుః
వెనుకబడిన జిల్లాల అభివృద్ధి గ్రాంటు,
13 షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థలు, మౌలిక వసతులు ప్రాజక్టులు
హార్టికల్చర్, గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు
వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ది
అవసరమైన బొగ్గు సరఫరాతో రాష్ట్రంలో 4వేల మెగావాట్ల విద్యుత్ సదుపాయాలు
రైల్వే కోచ్ కర్మాగారం ఏర్పాటు
ఇవి కూడా చదవండి...
బంగారం ధరలు షాక్ కొట్టిస్తున్నాయి..
CM Chandrababu: ఆ నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్
Read Latest AP News And Telangana News And Telugu News