Varra Health Issues: కడప జైలు నుంచి రిమ్స్‌కు వర్రా రవీందర్
ABN , Publish Date - Mar 11 , 2025 | 01:10 PM
Varra Health Issues: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వర్రాను.. ఈరోజు ఉదయం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

కడప, మార్చి 11: సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో అరెస్ట్ అయిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని (Varra Ravinder Reddy) కడప జైలు నుంచి రిమ్స్‌కు తరలించారు. అనారోగ్య కారణాల వల్ల చికిత్స కోసం వర్రాను జైలు అధికారులు రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో చికిత్స అనంతరం ఆయనను తిరిగి జైలుకు తరలించారు పోలీసులు. మరోవైపు వర్రా రవీందర్ రెడ్డి కోసం ఎన్టీఆర్ జిల్లా చిల్లేకళ్ళు పోలీసులు కడప సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. గతంలో వర్రాపై చిల్లేకళ్లు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. దీంతో పీటీ వారెంట్‌తో చిల్లేకళ్లు పోలీసులు.. కడప సెంట్రల్ జైలుకు వెళ్లారు. ప్రస్తుతం వర్రా కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
అయితే.. మొదట చిల్లేకళ్లు పోలీసులు రిమ్స్‌కు వెళ్లారు. అనారోగ్య కారణాల వల్ల వర్రాను రిమ్స్‌కు తీసుకువచ్చామని.. ఇక్కడి నుంచి తీసుకెళ్లేందుకు వీలులేదని.. రిమ్స్‌ను నుంచి కడప జైలుకు తరలించాక.. అక్కడ ప్రాసెస్ పూర్తి చేశాక వర్రాను తీసుకెళ్లాలని కడప పోలీసులు స్పష్టం చేశారు. చికిత్స అనంతరం వర్రాను తిరిగి కడప సెంట్రల్‌కు తరలించారు పోలీసులు. దీంతో కడప జైలు సూరింటెండెంట్‌కు పీటీ వారెంట్‌ను ఇచ్చిన అనంతరం అక్కడి నుంచి వర్రాను చిల్లేకళ్లుకు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Police Complaint Against Duvvada: వరుస ఫిర్యాదులు.. నెక్ట్స్ దువ్వాడేనా
కాగా.. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan), మంత్రులు లోకేష్ (Minister Lokesh), వంగలపూడి అనిత, పీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి, జగన్ తల్లి విజయమ్మ, మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతపై సోషల్ మీడియాలో అత్యంత హేయంగా, జుగుప్సాకరంగా రవీందర్‌రెడ్డి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాడు. ఈ క్రమంలో ఆయనపై మంగళగిరి, హైదరాబాద్‌తో పాటు పలుచోట్ల కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి...
Vamsi Case Update: వంశీ కేసు.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
Special Needs Schools: ఏపీలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు
Read Latest AP News And Telugu News