Share News

Nara Lokesh Counter On Jagan: ఓరి నీ.. VIP పాసులు ఏందయ్యా? ఎప్పుడూ వినలే..!

ABN , Publish Date - Sep 02 , 2025 | 12:57 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌ అధికారం నుంచి దిగిపోయినా తన ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు లేనట్లుగా తెలుస్తోంది. ఇటీవల సొంత నియోజకవర్గంలో ఆయన ప్రవర్తించిన తీరుపై మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు.

Nara Lokesh Counter On Jagan: ఓరి నీ..  VIP పాసులు ఏందయ్యా? ఎప్పుడూ వినలే..!
Nara Lokesh Counter On Jagan

ఇంటర్నెట్ డెస్క్: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌ అధికారం నుంచి దిగిపోయినా తన ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు లేనట్లుగా తెలుస్తోంది. ఇటీవల సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లిన జగన్ అక్కడి ప్రజలను కలవడానికి వీఐపీ పాసులు జారీ చేయడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్ తీరును సొంత నియోజకవర్గ ప్రజలతోపాటు పలువురు వైసీపీ నేతలు సైతం తప్పుబడుతున్నారు.


కాగా, ఈ విషయంపై మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో సెటైరికల్‌గా స్పందించారు. ఓరి నీ పాసుగాల! సినిమా ఫంక్షన్లకు VIP పాసులు విన్నాం గానీ.. సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి VIP పాసులు ఏందయ్యా? ఎప్పుడూ వినలే..! చూడలే..! అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేశారు.


తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్ జగన్ తన సొంతూరు పులివెందులకు సోమవారం నాడు వెళ్లారు. ఈ సందర్భంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డితోపాటు మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఇతర వైసీపీ ముఖ్య నేతలు ఆయణ్ని కలిశారు. ఈ నేపథ్యంలో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో డిపాజిట్ కోల్పోవడంపై జగన్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అనంతరం జగన్ కేవలం కొందరు కార్యకర్తలను మాత్రమే కలుసుకున్నారు. అది కూడా VIP పాసులున్న వ్యక్తులను మాత్రమే కలవడంపై సొంత పార్టీ నేతలు, కార్యకరలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Also Read:

ఉద్యాన పంటలకు మద్దతు ధరపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

వారి తప్పిదం.. ప్రతిభావంతుడికి తీవ్ర అన్యాయం

For More Andhra Pradesh News

Updated Date - Sep 02 , 2025 | 02:00 PM