Bharathi Cement Case: భారతి సిమెంట్ మేనేజర్‌పై కేసు నమోదు..
ABN , Publish Date - Oct 31 , 2025 | 08:16 AM
కడపకు చెందిన మహబూబ్‌ఖాన్ దగ్గర రూ.60 లక్షలు అడ్వాన్స్ తీసుకుని భారతి సిమెంట్ మేనేజర్ భార్గవ్ రెడ్డి మొహం చాటేసినట్లు తెలుస్తోంది. దీంతో మహబూబ్‌ఖాన్ కోర్టును ఆశ్రయించారు.
కడప: భారతి సిమెంట్ మేనేజర్ భార్గవ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ సీఎం జగన్ హయాంలో భూముల విషయంలో భార్గవ్‌రెడ్డి మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కడపకు చెందిన మహబూబ్‌ఖాన్ దగ్గర రూ.60 లక్షలు అడ్వాన్స్ తీసుకుని మొహం చాటేసినట్లు తెలుస్తోంది. దీంతో మహబూబ్‌ఖాన్ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టు ఆదేశాలతో భార్గవ్‌రెడ్డిపై సీకే దిన్నె పోలీసులు కేసు నమోదు చేశారు.
సీకే దిన్నె మండలం మామిళ్లపల్లె రెవెన్యూ గ్రామంలోని భూమిని రూ.10 కోట్లుండగా.. రూ. 3 కోట్లకే దక్కుతుందని కొంతమంది మహబూబ్‌ఖాన్‌కు నమ్మబలికారు. దీంతో నగదు చెల్లించి వ్యక్తులతో ఒప్పంద పత్రం రాయించుకున్నారు. ఎంతకూ వారు భూమి చూపకపోవడంతో ఆరా తీశారు. ఇతరుల పేరిట ఉన్నట్లు గుర్తించి మోసపోయానని గ్రహించారు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం నెల రోజుల్లోపు కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు చేపట్టాలని న్యాయమూర్తి ఆదేశించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఈ భూ వ్యవహారంలో భారతి సిమెంట్ కంపెనీ మేనేజర్ భార్గవరెడ్డి కీలక పాత్రధారిగా ఉన్నట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో భార్గవరెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి..
Father Heartfelt Plea: ఓ తండ్రి ఆవేదన
Justice Suryakant: 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్