Kadapa: తుది దశకు సోలార్ పనులు..
ABN , Publish Date - Sep 05 , 2025 | 10:13 AM
మండలంలోని టీకోడూరు గ్రామం సమీపంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న మెగా సోలార్ పవర్‌ప్లాంట్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. 300 మెగావాట్ల సామర్థ్యంతో 1500 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ మెగా సోలార్‌పవర్ ప్లాంట్ పనులు చకచకా జరుగుతున్నాయి.
- రూ.1700 కోట్లతో 1500 ఎకరాల్లో..
కొండాపురం(కడప): మండలంలోని టీకోడూరు గ్రామం సమీపంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న మెగా సోలార్ పవర్‌ప్లాంట్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. 300 మెగావాట్ల సామర్థ్యంతో 1500 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ మెగా సోలార్‌పవర్ ప్లాంట్ పనులు చకచకా జరుగుతున్నాయి. దీనిని రూ.1700 కోట్ల వ్యయంతో కేంద్రప్రభుత్వం నిర్మిస్తోంది. 2024 సంవత్సరంలో ప్రారంభమైన పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ సోలార్ ప్రాజెక్టుకు రైతుల నుంచి 1500 ఎకరాల భూమిని సేకరించారు.

లీజు ప్రాతిపదికన సంవత్సరానికి రూ.30,000 చెల్లిస్తారు. ప్రస్తుతం రైతుల అంగీకరం మేరకు వారి భూముల్లోనే సోలార్ ప్యానెళ్లు అమర్చే ప్రక్రియ దాదాపు పూర్తి కావస్తోందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రాంతంలోనే విద్యుత్‌సబ్‌స్టేషన్‌ను కూడా ఏర్పాటుచేశారు. సోలార్ ప్యానెళ్ల నుంచి సౌరశక్తిని తీసుకుని దానిని విద్యతుసబ్‌స్టేషన్‌కు మళ్లిస్తారు. తద్వారా గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. ఆ ప్రాజెక్టు ద్వారా దాదాపు 300 మందికి ఉద్యాగాలు లభించనున్నాయి.
మూడునెలల్లో పూర్తికి సన్నాహాలు
సోలార్‌ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. మూడునెలల్లో పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మస్తున్న ఈ ప్రాజెక్టులో స్థానికంగా 80 శాతం మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం.
- సంజయ్, సోలార్‌ప్రాజెక్టు ఇన్‌చార్జ్జి
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించాలి
‘గే’ యాప్ ‘గ్రైండర్’ ద్వారా డ్రగ్స్ విక్రయం
Read Latest Telangana News and National News