రైతుకు ఊతమిచ్చే బడ్జెట్: మంత్రి అచ్చెన్న
ABN , Publish Date - Feb 02 , 2025 | 04:23 AM
‘ఈ బడ్జెట్ ద్వారా ఎన్డీయే సర్కార్ రైతు పక్షపాత ప్రభుత్వమని రుజువైంది. రూ.50,65,345కోట్ల బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.1,71,437 కేటాయించి...
అమరావతి, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్ వ్యవసాయ రంగానికి, రైతాంగానికి మరింత ఊతమిచ్చేలా ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. ‘ఈ బడ్జెట్ ద్వారా ఎన్డీయే సర్కార్ రైతు పక్షపాత ప్రభుత్వమని రుజువైంది. రూ.50,65,345కోట్ల బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.1,71,437 కేటాయించి, వ్యవసాయ రంగ కేంద్రీకృత బడ్జెట్‌గా నిలిచి రైతుల మన్ననలు పొందింది. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణ పరిమితిని 3 నుంచి 5లక్షలకు పెంచడం, కాటన్ మిషన్ ఏర్పాటు, జాతీయ విత్తన మిషన్ ఏర్పాటు, మత్స్య సంపద వృద్ధికి, ఆక్వా రైతులకు తోడ్పాటు కల్పించే చర్యలు, కొత్తగా అసోంలో యూరియా ప్లాంట్, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించడం ద్వారా రైతాంగానికి మేలు చేసేలా కేంద్ర బడ్జెట్ ఉంది’ అని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ఉందని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు నిధులు కేటాయించిన ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా, యువతకు ఉపాధి అవకాశాలు పెంచేలా, రైతులకు వ్యవసాయాన్ని లాభసాటి చేసేలా కేంద్ర బెడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు.
Also Read: ఏపీ జీవనాడికి ఊపిరి పోసిన నిర్మలమ్మ
For AndhraPradesh News And Telugu News