Jogi Ramesh: నన్ను మద్యం కేసులో ఇరికించాలని చూస్తున్నారు.. సీబీఐకి అప్పగించాలి: జోగి రమేష్
ABN , Publish Date - Oct 13 , 2025 | 09:11 PM
నకిలీ మద్యం కేసులో సీఎం చంద్రబాబు పీకల వరకు మునిగిపోయారని, ఎవరో ఒకరి మీద నెపం వేసి ఇరికించాలని చూస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. ఇటువంటివి చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు.
నకిలీ మద్యం కేసులో సీఎం చంద్రబాబు పీకల వరకు మునిగిపోయారని, ఎవరో ఒకరి మీద నెపం వేసి ఇరికించాలని చూస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. ఇటువంటివి చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఏలేరు స్కామ్ దగ్గర నుంచి మొలకచెరువు వరకు చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించారు (Jogi Ramesh liquor case).
నకిలీ మద్యం కేసులో చంద్రబాబు తన గుప్పెట్లో ఉన్న సిట్ ని ఏర్పాటు చేశారని, నిజమైన దోషులను పట్టుకోవాలంటే సీబీఐ దర్యాప్తుకి ఇవ్వాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు (AP liquor scam). నకిలీ మద్యంతో పేద ప్రజల బతుకులు చిదిమేసే స్థాయికి టీడీపీ ప్రభుత్వం చేరిందని, నకిలీ మద్యం తయారు చేయడాన్ని టీడీపీ నాయకులు కుటీర పరిశ్రమగా మార్చుకున్నారని జోగి రమేష్ విమర్శించారు.
ప్రజలకు గుక్కెడు మంచినీరు ఇవ్వలేని టీడీపీ ప్రభుత్వం నకిలీ మద్యాన్ని మాత్రం విరివిగా సరఫరా చేస్తోందని రమేష్ ఆరోపించారు (fake liquor AP). 16 నెలల్లోనే చంద్రబాబు పోవాలి, జగన్ రావాలని జనం కోరుకుంటున్నట్టు జోగి రమేష్ అన్నారు. ఏపీ నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అద్దేపల్లి జనార్దన్ రావు సంచలన విషయాలు వెల్లడించారు. వైసీపీ పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ చేసినట్టు ఆయన చెప్పారు. దీనికి కౌంటర్ గా జోగి మాట్లాడారు.
ఈ వార్తలు కూడా చదవండి...
నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్
ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు
Read Latest AP News And Telugu News