Janasena: పవన్ మాటలను వక్రీకరిస్తూ.. ప్రజల మనోభావాలతో ఆడుకోరాదు..
ABN , Publish Date - Dec 04 , 2025 | 11:45 AM
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ మాటలను వక్రీకరించి ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మంచిదికాదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఆయన మాడియాతో మాట్లాడుతూ... పేర్నినాని లాంటి వాళ్లు తిన్నింటి వాసాలు లెక్కపెడతారని ఆయన అన్నారు.
- జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకంమధు
ధర్మవరం(అనంతపురం): రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పవన్‌కల్యాణ్(Pavankalyan) మాటలను వక్రీకరించి ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మంచిదికాదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు రెండు తెలుగురాష్ట్రాలూ సమానమే అన్నారు. ఆయన ఎప్పుడూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్దిని కోరుకుంటారన్నారు. కోనసీమ ఎప్పుడూ పచ్చదనంతో ఉండేది,
ఈ పచ్చదనం గురించి ఆంధ్ర, తెలంగాణ ప్రజలు చర్చించకునే వారు అన్నారే కానీ ఎక్కడా తెలంగాణ ప్రజల వల్ల అన్యాయం జరిగిందని అనలేదన్నారు. దీనిని వక్రీకరించడం బావ్యం కాదన్నారు. అదేవిధంగా పేర్నినాని లాంటి వాళ్లు తిన్నింటి వాసాలు లెక్కపెడతారని గ్రహించిన ఆంధ్ర ప్రజలు ఆయనకు, ఆయన పార్టీకి గత ఎన్నికల్లో బుద్ది చెప్పినా జ్ఞానోదయం కాలేదని మండిపడ్డారు. త్వరలో వైసీపీకి గోరీ కట్టే రోజు దగ్గరలోనే ఉందని ఆయన అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింత పెరిగిన పుత్తడి ధరలు.. రికార్డు స్థాయికి వెండి
Read Latest Telangana News and National News