Share News

Nagababu : వ్యక్తిగత అజెండాలు వదలండి

ABN , Publish Date - Jan 28 , 2025 | 05:18 AM

ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చే వారు వారి వ్యక్తిగత అజెండాలు వదిలిపెట్టాలి. ప్రజా సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి’

Nagababu : వ్యక్తిగత అజెండాలు వదలండి

  • జనసేనలో చేరిన వైసీపీ నేతలకు నాగబాబు సూచన

అమరావతి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): ‘జనసేనలో కొత్తగా చేరే వారు క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలి. ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చే వారు వారి వ్యక్తిగత అజెండాలు వదిలిపెట్టాలి. ప్రజా సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి’ అని జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు సూచించారు. సోమవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, నందిగామ నియోజకవర్గాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు జనసేనలో చేరారు. వీరందరికీ నాగబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్‌, వేములపాటి అజయ్‌కుమార్‌, చిలకం మధుసూదన్‌ రెడ్డి, సామినేని ఉదయభాను ఇతర నాయకులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్‌కు పవన్ అభినందనలు

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 28 , 2025 | 05:18 AM