Nellore జనసేన డిమాండ్.. ఉదయగిరిని జిల్లా చేయాలి
ABN , Publish Date - Sep 03 , 2025 | 01:45 PM
అనాదిగా అభివృద్ధికి నోచుకోని మెట్ట ప్రాంతమైన ఉదయగిరిని జిల్లా చేయాలని మంగళవారం డిప్యూటీ తహసీల్దారు షాజియాకు జనసేన పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు.
ఉదయగిరి(నెల్లూరు): అనాదిగా అభివృద్ధికి నోచుకోని మెట్ట ప్రాంతమైన ఉదయగిరి(Udayagiri)ని జిల్లా చేయాలని మంగళ వారం డిప్యూటీ తహసీల్దారు షాజియాకు జనసేన పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నూతన జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినందున ఈప్రాంత స్థితిగతు లను పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఉదయగిరి అభివృద్ధి జిల్లా ఏర్పాటుతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అల్లూరి రవీంద్ర, కిరణ్‌కుమార్, రవి, మహేష్, కేశవ్, సురేష్, మాల్యాద్రి పాల్గొన్నారు.

పోలేరమ్మకు పొంగళ్లు
మండలంలోని మాసాయిపేటలో మంగళవారం గ్రామదేవత పోలేరమ్మకు గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో పొంగళ్లు నిర్వహించారు. ముందు గా గ్రామవీధుల్లో ఊరేగింపు జరిపి ఆలయం వద్దకు చేరుకుని పొంగళ్లు పొంగించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని పూజలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరలు మరింత పైకి.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
జూబ్లీహిల్స్‌లో 3,92,669 మంది ఓటర్లు
Read Latest Telangana News and National News