Pawan Kalyan : సగటు మనిషి కోపం నుంచే జనసేన పుట్టింది: పవన్‌కళ్యాణ్
ABN , Publish Date - Aug 30 , 2025 | 08:02 PM
సగటు మనిషి కోపం నుంచే జనసేన పుట్టిందని ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు. 'సేనతో సేనాని' పేరిట జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా నేడు విశాఖపట్నంలో..
వైజాగ్, ఆగస్టు 30 : సగటు మనిషి కోపం నుంచే జనసేన పుట్టిందని ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు. పోరాటాల గడ్డ తెలంగాణలో పార్టీ ప్రారంభించామని చెప్పిన పవన్.. 11 ఏళ్ల ప్రయాణంలో ఏపీలో నిలదొక్కుకున్నామన్నారు. జనసేన ఓ కుటుంబం కోసం, రాష్ట్రం కోసం పెట్టిన పార్టీ కాదని, వందశాతం స్ట్రైక్‌రేట్‌తో దేశంలోనే చరిత్ర సృష్టించామని పవన్ చెప్పారు.
ఈ 11 ఏళ్ల ప్రయాణంలో కుటుంబం, సినిమాల కంటే జనసేన పార్టీపైనే ఎక్కువ దృష్టిపెట్టానని పవన్ తెలిపారు. తగిలిన ఎదురు దెబ్బలు మరింత రాటుదేల్చాయి. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడ్డాం కావునే ప్రజలకు మేలు చేస్తున్నామని తెలిపారు. వీరమహిళల సేవలను ఎప్పటికీ మరచిపోలేమన్నారు.ఇతర రాష్ట్రాల నుంచి సభకు వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
'కులం, కుటుంబం, రాష్ట్రం, ప్రాంతం కోసం పెట్టిన పార్టీ కాదు మనది. ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యలు పరిష్కరించాం. ఏజెన్సీలో డోలీ మోతలు చూసి నా హృదయం ద్రవించింది. ప్రజల కష్టాలు పరిష్కరించినప్పుడు నా నిర్ణయం సరైందే అనిపించింది. 2019-24 మధ్య మనల్ని అనేక రకాల బాధలు పెట్టారు. అయినా ప్రధాని, హోంమంత్రిని సాయం అడగలేదు. ఆనాడు కేంద్ర పెద్దల సాయం అడిగేకంటే పార్టీ మూసుకోవడం మంచిదనుకున్నా.' అని పవన్ కళ్యాణ్ తన సేనని ఉద్దేశించి మాట్లాడారు.
'సేనతో సేనాని' పేరిట జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా నేడు విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు ప్రాంగణం(ఇందిరా ప్రియదర్శిని స్టేడియం)లో జరుగుతున్న బహిరంగ సభలో పవన్ పార్టీ జనసైనికుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. నాయకుడు అనేవాడు కిందనుంచే రావాలని పవన్ ఈ సందర్భంగా అన్నారు. నిస్వార్థంగా పనిచేస్తున్నాం, మంచి ఫలితాలే వస్తున్నాయని పవన్ తెలిపారు.
'నోవాటెల్ హోటల్ లో అక్రమ అరెస్టులు చేశారు. కేంద్రానికి ఒక్క ఫోన్ కూడా చేయలేదు. సహాయం అడిగితే.. నేను పార్టీ మూసుకొని వెళ్లాల్సిందే. నేను, వీర సైనికులు ఏదురొడ్డి నిలబడ్డాం. జనసేన బలోపేతానికి రానున్న రోజుల్లో మెంబర్‌షిప్ , లీడర్ షిప్‌తో ముందుకు వెళ్తాం. నాయకులు కింద నుంచి రావాలి. త్రిశూల్ ప్రోగ్రాం దసరా తర్వాత ప్రారంభిస్తాం.'అని పవన్ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
గణేశుడి మండపం వద్ద కరెంట్ షాక్‌తో బాలుడి మృతి
Read Latest Telangana News and National News