Jagan: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ దారుణం
ABN , Publish Date - May 01 , 2025 | 05:29 AM
సింహాచల గోడ కూలిన విషాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని జగన్ విమర్శ. మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్.
మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారమివ్వాలి: జగన్
విశాఖపట్నం, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): సింహాచలం అప్సన్న చందనోత్సవం సందర్భంగా గోడకూలి ఏడుగురు ప్రాణాలు కోల్పోవడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ఆరోపించారు. బుధవారం ఈ ఘటనలో మృతిచెందిన మధురవాడ చంద్రంపాలేనికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పిళ్లా మహేశ్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చందనోత్సవానికి లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసినా దారుణమైన ఏర్పాట్లు చేశారని ఆరోపించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఎల్‌జీ పాలిమర్స్ ఘటన జరిగితే మృతులకు రూ.కోటి పరిహారం ఇచ్చామని.. చందనోత్సవం సందర్భంగా చనిపోయినవారి కుటుంబాలకు కూడా రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకుని వారి కుటుంబాలకు మిగిలిన మొత్తాన్ని అందజేస్తామని జగన్ హామీ ఇచ్చారు.
Also Read:
సామ్ కర్రన్ సూపర్ ఇన్నింగ్స్.. ఛాహల్ హ్యాట్రిక్
రిటైర్మెంట్‌పై బాంబు పేల్చిన ధోని
ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా..
For More Andhra Pradesh News and Telugu News..