Share News

Traffic Disruption: వీళ్లు మారరు

ABN , Publish Date - Aug 07 , 2025 | 04:43 AM

మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తనయుడు బుగ్గన అర్జున్‌ అమర్నాథ్‌ రెడ్డి వివాహ రిసెప్షన్‌

Traffic Disruption: వీళ్లు మారరు

  • బుగ్గన కుమారుడి రిసెప్షన్‌కు జగన్‌

  • డోన్‌లో వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహం

  • ‘తగ్గేదేలే’ పోస్టర్లు ప్రదర్శిస్తూ హల్‌చల్‌

  • 20 నిమిషాల పాటు హైవేపై ట్రాఫిక్‌ జామ్‌

  • వాహనదారులు, ప్రయాణికులకు ఇబ్బందులు

డోన్‌ రూరల్‌, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తనయుడు బుగ్గన అర్జున్‌ అమర్నాథ్‌ రెడ్డి వివాహ రిసెప్షన్‌ నంద్యాల జిల్లా డోన్‌ పట్టణ సమీపంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ హాజరయ్యారు. తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఉదయం రూ.11.45 గంటలకు ఆయన డోన్‌కు చేరుకున్నారు. వధూవరులను ఆశీర్వదించి 12.30 గంటలోపు హెలికాప్టర్‌లో బెంగళూరుకు వెళ్లిపోయారు. ఎన్‌హెచ్‌-44 పక్కన ఉన్న దత్తాత్రేయ స్వామి గుడికి సమీపంలో రిసెప్షన్‌ ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి. జగన్‌ వచ్చి, తిరిగి వెళ్లేవరకు పోలీసులు హైవేపై వాహనాలను నిలిపివేశారు. సుమారు 20 నిమిషాల పాటు ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం ట్రాఫిక్‌ను క్లియర్‌ చేసేందుకు పోలీసులు అవస్థలు పడాల్సి వచ్చింది. డోన్‌ డీఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలో మొత్తం 150 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, జగన్‌ రాకను పురస్కరించుకుని వైసీపీ అభిమానులు ‘తగ్గేదేలే..’ అంటూ జగన్‌ ఫొటోతో ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ బైకుల మీద హెలిప్యాడ్‌ ప్రధాన రోడ్డు ప్రాంతంలో కొద్దిసేపు హల్‌చల్‌ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇంటి వద్దకే రేషన్‌ పంపిణీ అంటూ ప్రవేశపెట్టిన రేషన్‌ పంపిణీ వాహనాన్ని రోడ్డుపై తిప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఒక పార్టీని టార్గెట్ చేస్తారా.. ఎంపీపై సుప్రీం అసహనం, రూ.10 లక్షల జరిమానా

ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 07 , 2025 | 04:44 AM