AP NEWS: కొల్లేరు ఆక్రమణలపై సుప్రీం కోర్టులో విచారణ
ABN , Publish Date - Jan 16 , 2025 | 02:45 PM
Supreme Court: కొల్లేరు ఆక్రమణలపై సుప్రీంకోర్టులో ఇవాళ(గురువారం) విచారణ జరిగింది. మూడు నెలల్లో కొల్లేరు ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం నివేదించింది. కొల్లేరు సరస్సు సరిహద్దుల వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

ఢిల్లీ: కొల్లేరు ఆక్రమణలపై సుప్రీంకోర్టులో ఇవాళ(గురువారం) విచారణ జరిగింది. మూడు నెలల్లో కొల్లేరు ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం నివేదించింది. కొల్లేరు సరస్సు సరిహద్దుల వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. గత ఏడాది డిసెంబర్‌లో విచారణ తర్వాత చేపట్టిన కార్యాచరణను సుప్రీంకోర్టు దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. కొల్లేరు సరిహద్దులు వచ్చే మూడు నెలల్లో ఖరారు చేయనున్నట్లు కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు సుమారు 5వేల ఎకరాల్లో ఆక్రమణలు తొలగించినట్లు ప్రభుత్వం తెలిపింది. మిగిలిన ఆక్రమణలు కూడా తొలగించే పనిలో ఉన్నట్లు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్‌ని పరిశీలించి.. తదుపరి నివేదిక దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 19వ తేదీకి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం వాయిదా వేసింది. మార్చి 19వ తేదీలోపు మిగిలిన వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.