Antibiotic Misuse Control: ఔషధ నిరోధకతపై ఉన్నతస్థాయి కమిటీ
ABN , Publish Date - Jul 21 , 2025 | 05:32 AM
ప్రజారోగ్య సంరక్షణకు ఔషధ నిరోధకత యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్
మంత్రి సత్యకుమార్... ఏఎంఆర్‌పై రిసెర్చ్ స్టడీకి ఎంవోయూ
గుంటూరు మెడికల్, జూలై 20(ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్య సంరక్షణకు ఔషధ నిరోధకత(యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్-ఏఎంఆర్) సవాల్‌గా మారుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఔషధ నిరోధకత కట్టడి చర్యలకు, యాంటీ బయోటిక్ మందుల విచ్చలవిడి వినియోగం తగ్గించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యనిపుణులతో కలిపి ఉన్నతస్థాయి కమిటీని నియమించనున్నట్లు మంత్రి ప్రకటించారు. గుంటూరు వైద్య కళాశాలలోని జింఖానా ఆడిటోరియంలో ఆదివారం ఏఎంఆర్ ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి నిరంతర వైద్య విద్య కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా యాంటీ బయోటిక్ ఔషధ నిరోధకత ఏ మేరకు ఏర్పడిందో తెలుసుకునేందుకు గుంటూరు రిఫరల్ లేబొరేటరీ కేంద్రంగా అధ్యయనం చేసేందుకు మంత్రి సమక్షంలో ఐఎంఏ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ గార్లపాటి నందకిశోర్‌తో సైంటిస్ట్ సందీప్ అవగాహన ఒప్పందం కుదర్చుకున్నారు. తన సొంత ఖర్చులతో ఈ రిసెర్చ్ స్టడీ చేసేందుకు ముందుకు వచ్చిన దాత, సైంటిస్ట్ సందీ్‌పను మంత్రి సత్యకుమార్ అభినందించారు. ఈ సందర్భంగా క్లినికల్ ఇన్‌ఫెక్షియ్‌స డిసీజెస్ సొసైటీ(సిడ్స్)రాష్ట్ర అధ్యక్షుడు, రిసెర్చ్ స్టడీ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ కె.కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిలో ఎంపిక చేసిన రోగుల నుంచి బ్లడ్ శాంపిల్స్‌ను గుంటూరులోని రీసెర్చ్ ల్యాబ్‌లో పరీక్షిస్తామన్నారు. మూడు నెలల వ్యవధిలో ఈ ల్యాబ్ టెస్ట్‌లు పూర్తి చేసి వచ్చిన ఫలితాలపై నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు.
9-14 ఏళ్ల లోపు పిల్లలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్
రాష్ట్రంలో 9 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలందరికీ సర్వైకల్, మెడ క్యాన్సర్ నివారణకు హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) వ్యాక్సిన్‌లు ఉచితంగా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దేశంలో ప్రతిరోజూ 1,600 మంది మహిళలు గర్భస్థ ముఖద్వార క్యాన్సర్‌తో మృతి చెందుతున్నట్లు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ క్యాన్సర్ నివారణ కోసం రాష్ట్రంలో 9-14 ఏళ్లలోపు పిల్లలకు ఉచితంగా హెచ్ పీవీ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు
ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
For More AndhraPradesh News And Telugu News