Share News

AP High Court : హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా హరిహరనాథశర్మ, లక్ష్మణరావు ప్రమాణం

ABN , Publish Date - Jan 25 , 2025 | 03:54 AM

హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథశర్మ, యడవల్లి లక్ష్మణరావు ప్రమాణం చేశారు.

AP High Court : హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా హరిహరనాథశర్మ, లక్ష్మణరావు ప్రమాణం

  • సింగిల్‌ బెంచ్‌లో కేసుల విచారణ

అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథశర్మ, యడవల్లి లక్ష్మణరావు ప్రమాణం చేశారు. శుక్రవారం హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ వారితో ప్రమాణం చేయించారు. అంతకుముందు వారి నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన నియామక ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌(ఎఫ్ఏసీ) వి.శ్రీనివాస శివరామ్‌ చదివి వినిపించారు. న్యాయాధికారులు అవధానం హరిహరనాథశర్మ, డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావులను ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ఈ నెల 11న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆమోదముద్ర వేయడంతో సీజే ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణం చేయించారు. ఏపీ హైకోర్టులో 37 మంది జడ్జీల నియామకానికి ఆమోదం ఉండగా ఈ సంఖ్య 28గా ఉంది. తాజాగా ఇద్దరు అదనపు న్యాయమూర్తుల చేరికతో సంఖ్య 30కి చేరింది. కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ గంగారావు, ప్రమాణం చేసిన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌, అదనపు ఏజీ సాంబశివ ప్రతాప్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం, హైకోర్టు రిజిస్ట్రార్‌లు, న్యాయవాదులు, అధికారులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం న్యాయమూర్తులు అవధానం హరిహరనాథశర్మ, డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావు వేర్వేరుగా సింగిల్‌ బెంచ్‌లో కేసులు విచారించారు.


మరిన్ని తెలుగు వార్తలు కోసం..

Also Read: మరికొన్ని గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు.. రైతు భరోసా పథకానికి కావాల్సింది ఇవే..

Also Read : తురకా కిషోర్‌ను నెల్లూరు జైలుకు తరలింపు

Also Read: కిడ్నీ రాకెట్ కేసు సీఐడీకి: మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశం

Also Read: రైలు ప్రమాద బాధితులు.. నష్ట పరిహారం ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే..?

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 25 , 2025 | 03:54 AM