Road Accident: శుభకార్యానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం..
ABN , Publish Date - Feb 16 , 2025 | 08:56 AM
Road Accident:శుభకార్యానికి వెళ్తుండగా ఊహించని ఘటన చోటుచేసుకుంది. బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్తున్న ఓ కుటుంబాన్ని మృత్యుదేవత వెంటాడింది. మరికాసేపట్లో వివాహ వేడుక వద్దకు చేరుకుంటారనగా వారు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న ఓ భారీ కబలించింది.
పల్నాడు జిల్లా: శుభకార్యానికి బయలుదేరిన కాసేపటికే లారీ రూపంలో ఆ కుటుంబాన్ని మృత్యువు కబలించింది. ఒకే ఇంట్లో ముగ్గురు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన పల్నాడు జిల్లాలోని రాజుపాలెం మండలం పెదనెమలిపూరి దగ్గర చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడుకు కారులో కుటుంబ సభ్యులు బయలు దేరారు. వారు వెళ్తున్న కారును ఒక్కసారిగా లారీ ఢీకొట్టింది. కారును లారీ ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో తల్లి , ఇద్దరు కొడుకులు చనిపోయారు.
మృతులు షేక్ నజీమా (50), షేక్ నూరుల్లా (26), షేక్ హబీబుల్లా(24) గా గుర్తించారు. మృతులు ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం కొత్తపల్లికి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జాం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి
DGP Hari Shankar Gupta : మహిళల జోలికొస్తే మరణదండనే!
Deputy CM Pawan Kalyan: ముగిసిన షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్ర
Buddha Venkanna : వారికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదు
Read Latest AP News and Telugu News