Share News

AP Group-2 Petitions Dismissed: గ్రూప్‌-2 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్

ABN , Publish Date - Dec 30 , 2025 | 02:12 PM

ఆంధ్రప్రదేశ్ గ్రూప్‌-2 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్ దక్కింది. గ్రూప్‌-2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.

AP Group-2 Petitions Dismissed: గ్రూప్‌-2 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్
AP Group-2 Reservations Petitions Dismissed

అమరావతి: ఆంధ్రప్రదేశ్ గ్రూప్‌-2 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్ దక్కింది. గ్రూప్‌-2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. కాగా, 2023లో విడుదలైన గ్రూప్-2 నోటిఫికేషన్‌‌పై రిజర్వేషన్ల విధానాన్ని సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ రోస్టర్‌ను పాటించాలని కోరుతూ అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు.


2023లో విడుదలైన గ్రూప్-2 నోటిఫికేషన్‌ను రద్దు చేసి, పాత నోటిఫికేషన్‌కు బదులు కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని అభ్యర్థులు కోరారు. రిజర్వేషన్ల పాయింట్లను సవాల్ చేస్తూ, ప్రభుత్వ నిర్ణయాలు సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ విషయంపై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు, రిజర్వేషన్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించింది.


Also Read:

రూ.100 కోట్ల విరాళం..గొప్ప మనసు చాటుకున్న విద్యార్థులు

వాటి కోసం ఒక యుద్దమే చేశాం: సీపీ రాజశేఖర్ బాబు

For More Latest News

Updated Date - Dec 30 , 2025 | 02:35 PM