Telugu Vikasam : గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్తు 'తెలుగు వికాసం' అవార్డులు
ABN , Publish Date - Sep 20 , 2025 | 10:16 PM
ఆంధ్ర సారస్వత పరిషత్తు 'తెలుగు వికాసం' పేరిట గుంటూరులో నిర్వహించిన లఘు చలన చిత్ర పోటీలలో 'పెద్ద బాల శిక్ష'కు ప్రధమ బహుమతి దక్కింది, 'ఉనికి' , 'తెలుగు వైభవం' చిత్రాలకు ద్వితీయ, తృతీయ బహుమతులు దక్కాయి.
గుంటూరు, సెప్టెంబర్ 20 : ఆంధ్ర సారస్వత పరిషత్తు 'తెలుగు వికాసం' పేరిట గుంటూరులో నిర్వహించిన లఘు చలన చిత్ర పోటీలలో 'పెద్ద బాల శిక్ష'కు ప్రధమ బహుమతి దక్కింది, 'ఉనికి' , 'తెలుగు వైభవం' చిత్రాలకు ద్వితీయ, తృతీయ బహుమతులు దక్కాయి. 'సుమధురం', 'కాసేపు తెలుగు లో మాట్లాడుకుందాం', 'మహాశయులు మళ్ళీ పుట్టాలి' చిత్రాలు ప్రత్యేక ప్రశంసా బహుమతులు గెలుచుకున్నాయి.
ఉత్తమ దర్శకుడు - (ఉనికి) అభిజిత్ సాయి రెడ్డి
ఉత్తమ రచన, సంభాషణలు - శ్వాస, వజ్రనాభ నటరాజ్ మహర్షి
ఉత్తమ నటి - నర్తకి (మా తెలుగు తల్లికి మల్లెపూదండ)
ఉత్తమ నటుడు - ఉదయ్ భాగవతుల (పెద్ద బాలశిక్ష)
ఉత్తమ ఛాయాగ్రహణం - అభి (మధులిక)
ఉత్తమ కూర్పు - సూర్య అకొండి
'తెలుగు వైభవం'కు వ్యక్తిగత ప్రతిభా బహుమతులు అందజేశామని ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్, ముఖ్య సమన్వయ కర్త పి. రామచంద్ర రాజులు తెలిపారు . పోటీల జ్యూరీ చైర్మన్ గా లోహిత్ కుమార్, సభ్యులుగా సాకేత్ ఉదయగిరి, శ్రీమతి లిరేష కూనపరెడ్డి నిర్వహించారు.
అంతకుముందు, తెలుగు చలన చిత్ర ప్రముఖులు కోన వెంకట్, దర్శకులు దశరథ్, బి.వి ఎస్. రవి, సిరాశ్రీ, మన చౌదరి లకు వొకేషనల్ ఎక్సలెన్సీ అవార్డులను రోటరీ క్లబ్ గుంటూరు ప్రదానం చేసింది.
వైభవంగా సాగిన ఈ కార్యక్రమంలో విశ్వ హిందీ పరిషత్ అధ్యక్షులు డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, శాసన సభ్యులు నజీర్ అహ్మద్, సాంస్కృతిక మండలి అధ్యక్షురాలు శ్రీమతి పొడపాటి తేజస్విని, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రామప్రసాద్, పరిషత్ నిర్వాహకులు రెడెప్ప ధవేజ్, మేడికొండ శ్రీనివాస్, అన్నా ప్రగడ రవి శ్రీనివాస్ , డా.కత్తి వెంకటేశ్వరావు, వాసిరెడ్డి విద్యాసాగర్, శ్రీమతి లఖ్ఖం రాజు సునీత తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
పల్నాడులో రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోను: సీఎం చంద్రబాబు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 9 మంది ఐఏఎస్‌ల బదిలీ
Read Latest AP News And Telugu News