AP Govt: కాంతార చాప్టర్ 1 టికెట్ ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN , Publish Date - Sep 29 , 2025 | 10:08 PM
తెలుగు సినిమాల విడుదల సందర్భంగా కర్ణాటకలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. అందులోభాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అమరావతి, సెప్టెంబర్ 29: తెలుగు సినిమాల విడుదల సందర్భంగా పొరుగు రాష్ట్రాల్లో ఎదురవుతున్న ఆటంకాలపై చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా ప్రభుత్వం ఆ దశగా చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో కన్నడలో తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 చిత్రం మరికొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల కానుంది. దీంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్‌ను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. కర్ణాటకలో తెలుగు చిత్రాలు విడుదల సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఈ సందర్భంగా వీరు చర్చించారని సమాచారం. దాంతో కన్నడ చిత్రం కాంతార చాప్టర్ 1 విడుదల సందర్భంగా టికెట్ ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
తెలుగు చిత్రాలు కర్ణాటకలో విడుదలవుతాయన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సందర్భంగా కన్నడ వాసులు.. ఈ చిత్రాలు విడుదలకు తీవ్ర అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీంతో ఈ సమస్య తీవ్ర రూపం దాలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ , హరిహర వీరమల్లు , ఓజీ సినిమాల రిలీజ్ సమయంలో పోస్టర్లను కన్నడిగులు తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో కర్ణాటకలో స్థానికులు, అక్కడ నివసిస్తున్న తెలుగు వారి మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. దాంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.
దాంతో తెలుగు సినిమాకు కర్ణాటకలో ఆటంకాలు కల్పిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అభ్యంతరాలు వెల్లువెత్తాయి. దాంతో ఈ సమస్యలపై అటు కన్నడ ఫిలిం ఛాంబర్.. ఇటు తెలుగు ఫిలిం ఛాంబర్‌ల కూర్చొని పరిష్కారం చేసుకోవాలంటూ ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వారికి స్పష్టం చేశారు. కళ మనుషుల్ని కలపాలి కానీ.. వీడదీయకూడదనే అభిప్రాయాన్నీ సీఎం, డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. మంచి మనస్సుతో.. జాతీయ భావనతో ఆలోచన చేయాలని వారికి వీరిద్దరు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
సియోల్‌లో రోడ్డు షో.. మంత్రి కీలక వ్యాఖ్యలు
For More AP News And Telugu News