GBS Virus: జీబీఎస్ వైరస్‌పై జీజీహెచ్ సూపరింటెండెంట్ ఏమన్నారంటే..
ABN , Publish Date - Feb 14 , 2025 | 10:55 AM
GBS Virus: జీజీహెచ్‌లో నాలుగు రోజుల్లో ఏడు కేసులు నమోదయ్యాయని జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి తెలిపారు. వారిలో ఇద్దరి డిస్చార్జ్ అయి వెళ్లిపోయారన్నారు. జీబీఎస్ వైరస్ పట్ల ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన పని లేదని స్పష్టం చేశారు. కాళ్లు, చేతులు చచ్చుపడినట్లు అనిపిస్తే వెంటనే ఆసుపత్రికి రావాలని సూచించారు.

గుంటూరు, ఫిబ్రవరి 14: ఏపీలో జీబీఎస్ వైరస్ (GBS Virus) పట్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలో జీబీఎస్ వైరస్ కేసులు ఎక్కువవుతుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే జిల్లాలో ఏడు కేసులు నమోదు అయ్యాయి. వీరంతా ప్రస్తుతం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. జీబీఎస్ వైరస్ పట్ల ప్రజల్లో నెలకొన్న అనుమానాలపై జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి (GGH Superintendent Ramana Yashaswi) స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జీబీఎస్‌కు సంబంధించి జీజీహెచ్‌లో నాలుగు రోజుల్లో ఏడు కేసులు నమోదయ్యాయని తెలిపారు. వారిలో ఇద్దరి డిస్చార్జ్ అయి వెళ్లిపోయారన్నారు. జీబీఎస్ వైరస్ పట్ల ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన పని లేదని స్పష్టం చేశారు. కాళ్లు, చేతులు చచ్చుపడినట్లు అనిపిస్తే వెంటనే ఆసుపత్రికి రావాలని సూచించారు. దీనికి సంబంధించి వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
గతంలో వైరల్ జబ్బుల బారిన పడిన వారికి ఈ సిండ్రోం వచ్చే అవకాశాలు ఎక్కువ అని తెలిపారు. కరోనా బారిన పడిన వారిలో ఇప్పుడు ఈ సిండ్రోం కనిపిస్తోందన్నారు. జీజీహెచ్ న్యూరాలజి విభాగంలో బాధితులకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. జీజీహెచ్‌కు ఇలాంటి కేసులు తరచుగా వస్తుంటాయన్నారు. ఇప్పుడు వేరే జిల్లాల నుంచి కేసులు రావడంతో సంఖ్య పెరిగినట్లు కనిపిస్తోందన్నారను. జీజీహెచ్‌లో చేరిన ఎనిమిదేళ్ల పాప ఈ సిండ్రోం నుంచి కోలుకుని డిస్చార్జ్ అయినట్లు వెల్లడించారు. జీజీహెచ్‌లో చేరిన వారిలో కోనసీమ, పల్నాడు జిల్లాల వారు కూడా ఉన్నారని సూపరింటెడెంట్ రమణ యశస్వి పేర్కొన్నారు.
అమెరికా అక్రమ వలసదారులపై మోదీ కీలక వ్యాఖ్యలు
కాగా.. జీబీఎస్ వైరస్‌తో శ్రీకాకుళం జిల్లాకు పదేళ్ల బాలుడు మృతి చెందాడనే వార్త ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. జీబీఎస్ వైరస్‌తో బాధపడుతున్న ఆ చిన్నారిని ముందుగా శ్రీకాకుళం, విశాఖపట్నం ఆస్పత్రుల్లో చికిత్స అందజేశారు. పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో రాగోలులోకి జెమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ చిన్నారికి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. జీబీఎస్ వైరస్‌తో బాలుడు చనిపోవడాయే వార్త ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. జీబీఎస్ వైరస్ పట్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఇవి కూడా చదవండి...
వేలంటైన్స్ డే స్పెషల్ ... లవ్ స్టార్స్
కళ్యాణ మంటపంలోకి చొరబడిన చిరుత.. చివరకు..
Read Latest AP News And Telugu News