APSRTC: గుడ్ న్యూస్.. సంక్రాంతి వేళ ఇంటికి వెళ్లాలని అనుకుంటున్నారా.. అయితే..
ABN , Publish Date - Jan 07 , 2025 | 04:38 PM
ఆంధ్రప్రదేశ్: సంక్రాంతి వేళ ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న ఏపీ ప్రజలు సంక్రాంతి పండగకు స్వగ్రామాలకు వచ్చేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని ప్రకటించింది.

హైదరాబాద్: సంక్రాంతి పండగ వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రయాణికులకు తీపి కబురు చెప్పింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ఏపీ ప్రజలు.. సంక్రాంతి పండగ (Sankranti Festival) సందర్భంగా స్వగ్రామాలకు వచ్చేందుకు ఏకంగా 7,200 అదనపు బస్సులు (Additional Buses) ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాలకు వీటిని నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. అలాగే 3,900 ప్రత్యేక బస్సులనూ (Special Buses) నడపనున్నట్లు తెలిపింది.
ACB RAIDS: ఫార్ములా ఈ కార్ రేస్.. ఏపీలో సోదాలు
ఈ సర్వీసులు జనవరి 8 నుంచి 13 వరకూ అందుబాటులో ఉంటాయని చెప్పింది. ప్రత్యేక బస్సులను హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ నుంచి నడపనున్నట్లు వెల్లడించింది. విజయవాడ నుంచి 300 బస్సులు, హైదరాబాద్ నుంచి 2,153, అలాగే బెంగళూరు నుంచి 375 బస్సులను ప్రయాణికుల కోసం నడపాలని నిర్ణయించింది. మరోవైపు ఈ బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదంటూ తీపి కబురు చెప్పింది. రెండు వైపులా ప్రయాణాలకు సంబంధించి ఒకేసారి టికెట్లు బుక్ చేసుకున్న వారికి 10 శాతం రాయితీ సైతం కల్పిస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. మరోవైపు పండగ తర్వాత తిరిగి వెళ్లేందుకు ఈనెల 16 నుంచి 20 వరకూ 3,200 ప్రత్యేక బస్సులనూ నడపనున్నట్లు ప్రకటించింది.
AP High court: హైకోర్టులో పేర్నినానికి స్వల్ప ఊరట
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు దేశవ్యాప్తంగా ఉన్న తెలుగువారు స్వగ్రామాలకు బయలుదేరిపోతుంటారు. వివిధ పట్టణాలు, నగరాల నుంచి పెద్దఎత్తున ప్రజలు రావడంతో బస్సుల కొరత ఏర్పడుతుంది. అయితే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ ఈ సమస్యను దృష్టిని ఉంచుకుని ప్రతి ఏటా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంటాయి. అయినా ప్రయాణికులు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఎన్ని బస్సులు ఏర్పాటు చేసినా సీట్లు దొరకడం కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈసారి భారీగా బస్సులను ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం వివిధ ప్రాంతాలకు 6,432 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈసారైనా ప్రయాణికుల కష్టాలు తీరుతాయని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Andhra Pradesh: దారుణం.. ప్రియురాలి తండ్రి కళ్ళల్లో కారం కొట్టి మరీ..
Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బిగుస్తున్న ఉచ్చు.. సుప్రీం కీలక తీర్పు