Share News

Sricharani: శ్రీచరణికి నజరానా.. ఉత్తర్వులు జారీ

ABN , Publish Date - Dec 15 , 2025 | 08:56 PM

కడప జిల్లాకు చెందిన అంతర్జాతీయ క్రికెట్‌కు నల్లపురెడ్డి శ్రీచరణి ఎంపికయ్యారు. 21 ఏళ్ల ఆమె లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్.

Sricharani: శ్రీచరణికి నజరానా.. ఉత్తర్వులు జారీ

అమరావతి, డిసెంబర్ 15: మహిళా ప్రపంచ కప్‌ గెలుపులో విశేష ప్రతిభ కనబరిచిన క్రికెటర్ శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహం ప్రకటించింది. రూ.2.50 కోట్ల నగదుతోపాటు కడప నగరంలో 1000 చదరపు గజాల విస్తీ్ర్ణంలో ఇంటి స్థలాన్ని కేటాయించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్‌-1 హోదా ఉద్యోగ నియమించింది. ఈ మేరకు సోమవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


కడప జిల్లాకు చెందిన అంతర్జాతీయ క్రికెట్‌కు నల్లపురెడ్డి శ్రీచరణి ఎంపికయ్యారు. 21 ఏళ్ల ఆమె లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్. ఈ ఏడాది శ్రీలంకలో జరిగిన వన్డేల్లో ఆమె అరంగేట్రం చేశారు. ఐసీసీ మహిళ ప్రపంచ కప్ గెలుచుకోవడంలో శ్రీచరణి కీలక పాత్ర పోషించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో రాష్ట్రం రగిలిపోయింది: సీఎం

వైసీపీ బైక్ ర్యాలీ.. రెండు వర్గాల మధ్య ఘర్షణ..

For More AP News And Telugu News

Updated Date - Dec 15 , 2025 | 08:58 PM