Share News

Two Bills Passes In AP Assembly: అసెంబ్లీలో మరో రెండు బిల్లులకు ఆమోద ముద్ర

ABN , Publish Date - Sep 24 , 2025 | 01:17 PM

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం రెండు బిల్లులకు ఆమోద ముద్ర పడింది. అక్వా డెవలప్‌మెంట్ అథారటీ సవరణ బిల్లుతోపాటు గ్రామ, వార్డు సచివాలయాల సవరణ బిల్లుకు ఆమోదం తెలిపాయి.

Two Bills Passes In AP Assembly: అసెంబ్లీలో మరో రెండు బిల్లులకు ఆమోద ముద్ర
Two Bills Passes In AP Assembly

అమరావతి, సెప్టెంబర్ 24: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం రెండు బిల్లులకు ఆమోద ముద్ర పడింది. అక్వా డెవలప్‌మెంట్ అథారటీ సవరణ బిల్లుతోపాటు గ్రామ, వార్డు సచివాలయాల సవరణ బిల్లుకు ఆమోదం తెలిపాయి.


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షా కాల సమావేశాలు కొనసాగుతున్నాయి. బుధవారం అసెంబ్లీలో రెండు బిల్లులు.. అక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారటీ సవరణ బిల్లుతోపాటు గ్రామ, వార్డు సచివాలయం చట్ట సవరణ బిల్లులను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అలాగే ఆక్వా, సహకార శాఖలకు సంబంధించి చట్ట సవరణ బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. కూటమి ఎమ్మెల్యేల మద్దతుతో సదరు బిల్లులకు ఆమోద ముద్ర వేశారు.


మరోవైపు మంగళవారం అసెంబ్లీలో మూడు బిల్లులతోపాటు ఒక తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించిన విషయం విదితమే. ఎస్సీ వర్గీకరణ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, భారతీయ నాగరిక్ సురక్షా సవరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి సభలో ప్రవేశపెట్టారు. వీటికి ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా, ఎంఎస్ రాజు, బి.రామాంజనేయులు మద్దతు తెలిపారు. ఈ బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇక స్థానిక సంస్థలకు నాలా ఫీజు ఇచ్చే పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సభలో ప్రవేశపెట్టారు. దీనిని ఎమ్మెల్యే పార్థసారథి మద్దతు తెలిపారు.


ఇక ఏపీ వ్యవసాయ భూమి చట్టం 2006 రద్దు చేసేందుకు దీనికి అనుగుణంగా పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే వ్యవసాయ భూములను వ్యవసాయేతర ప్రయోజనాలకు మార్పు చేసినప్పుడు చెల్లించే నాలా ఫీజును ఇప్పటి వరకు రెవెన్యూ శాఖ వసూలు చేస్తోంది. ఇకపై ఈ నాలా ఫీజు స్థానిక సంస్థలకు చెందనుంది. అదే విధంగా మాన్యువల్ స్కావెంజర్ల నియామకం, డ్రై మరుగుదొడ్ల నిర్మాణ నిషేధ చట్టాన్ని రద్దు చేయాలనే తీర్మానాన్ని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ప్రవేశపెట్టారు. దీనిని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనిని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని తీర్మానించింది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి ఫరూఖ్ సభలో ప్రవేశపెట్టారు.

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ ప్రతిపక్ష హోదా పిటిషన్.. స్పీకర్‌కు నోటీసులు

కనిమొళికి ఈపీఎస్‌ కౌంటర్‌.. అరివాలయాన్ని కాపాడింది ‘అమ్మే’

For More AP News And Telugu News

Updated Date - Sep 24 , 2025 | 01:25 PM