Share News

YS Jagan: జగన్ ప్రతిపక్ష హోదా పిటిషన్.. స్పీకర్‌కు నోటీసులు

ABN , Publish Date - Sep 24 , 2025 | 11:31 AM

గతంలో జగన్ రాసిన లేఖపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు రూలింగ్ ఇచ్చారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాను తామెలా ఇస్తానని ప్రశ్నించారు.

YS Jagan: జగన్ ప్రతిపక్ష హోదా పిటిషన్.. స్పీకర్‌కు నోటీసులు
Jagan

అమరావతి: తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్‌‌ను ఆదేశించాలని కోరుతూ మాజీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌‌పై ఇవాళ(బుధవారం) హైకోర్ట్‌‌లో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతివాదులుగా ఉన్న అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్‌‌కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. గతంలో జగన్ వేసిన పిటీషన్‌‌ను కూడా ఈ పిటిషన్‌‌కు కలపాలని ఆదేశించింది.

గతంలో జగన్ రాసిన లేఖపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు రూలింగ్ ఇచ్చారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాను తామెలా ఇస్తామని ప్రశ్నించారు. రాజ్యాంగం, అసెంబ్లీ నిబంధనలు అంగీకరించవని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్ రూలింగ్‌‌పై హైకోర్ట్‌‌ను జగన్ ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్‌‌ను ఆదేశించాలని పిటిషన్ వేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేసింది.

Updated Date - Sep 24 , 2025 | 11:35 AM