AP Minister Sathya Kumar: నిరంతర పర్యవేక్షణ.. సత్ఫలితాలను ఇస్తుంది: మంత్రి సత్యకుమార్
ABN , Publish Date - Oct 30 , 2025 | 08:56 PM
వైద్య సిబ్బంది హాజరు, ఓపీ, ఐపీ సేవల్లో పురోగతి కనిపించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. రోగికి ఓపీ సేవలు 42 నిమిషాల నుంచి 26 నిమిషాలకు తగ్గడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నూతన మూల్యాంకన వ్యవస్థ ద్వారా జిల్లాలకు ర్యాంకులు ఇచ్చామన్నారు.
అమరావతి, అక్టోబర్ 30: ప్రభుత్వాసుపత్రుల్లో నిరంతర పర్యవేక్షణ సత్ఫలితాలను ఇస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. గురువారం రాజధాని అమరావతిలో గత ఆరు నెలలో ప్రభుత్వాసుపత్రుల పని తీరుపై ఉన్నతాధికారులతో మంత్రి సత్యకుమార్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది హాజరు, ఓపీ, ఐపీ సేవల్లో పురోగతి కనిపించిందన్నారు. రోగికి ఓపీ సేవలు 42 నిమిషాల నుంచి 26 నిమిషాలకు తగ్గడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
నూతన మూల్యాంకన వ్యవస్థ ద్వారా జిల్లాలకు ర్యాంకులు ఇచ్చామన్నారు. అగ్రస్థానంలో తూర్పుగోదావరి, కడప, తిరుపతి జిల్లాలు ఉండగా.. వెనుకబడి జిల్లాల జాబితాలో అల్లూరి సీతారామరాజు , గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలు ఉన్నాయని వివరించారు. ఈ ఆరు నెలల్లో ప్రభుత్వ వైద్యులు, ఇతర సిబ్బంది హాజరు శాతం పెరిగిందని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో 83 శాతం ఉండగా.. ఇది సెప్టెంబర్‌లో 92 శాతానికి పెరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నర్సులు, పారా మెడికల్ సిబ్బంది 90 శాతానికి పైగా హాజరయ్యారన్నారు.
అయితే వైద్యుల హాజరు 82 శాతం మాత్రమే ఉండడం పట్ల తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ వైద్యశాలల్లో మొత్తం 4 కోట్లకు పైగా ఓపీ సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఎన్‌హెచ్ఎం పథకాల అమలులో.. తూర్పు గోదావరి, కడప, తిరుపతి జిల్లాలు అగ్రస్థానంలో ఉంటే.. అల్లూరి సీతారామరాజు, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలు వెనుకబడిన జాబితాలో ఉన్నాయని వివరించారు.
అసంక్రమిత వ్యాధుల బారిన పడిన వారికి చికిత్సలు అందించడంలో నెలకొన్న లోపాలను సవరించాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. ఇక మూల్యాంకన వ్యవస్థల ఫలితాల ఆధారంగా వెల్లడైన లోపాలను సిరిదిద్దుకోవడానికి తగు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్.. రాష్ట్రపతి ఉత్తర్వులు
జగన్‌కు మంత్రి అచ్చెన్నాయుడు చాలెంజ్
Read Latest AP News And Telugu News