Vijayawada : గుణదల లూర్ధుమాత 101వ మహోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Feb 10 , 2025 | 04:48 AM
గుణదల కొండపై కొలువైన గుణదల(లూర్దు)మాత 101వ మహోత్సవాలు ఆదివారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి.

గుణదల, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ప్రజలను దేవుని మార్గంలో నడిపించడానికి మరియమాత అనేక ప్రాంతాల్లో భక్తులకు దర్శనమిచ్చిందని విజయవాడ కతోలిక పీఠం బిషప్ మోస్ట్ రెవరెండ్ తెలగతోటి జోసఫ్ రాజారావు అన్నారు. గుణదల కొండపై కొలువైన గుణదల(లూర్దు)మాత 101వ మహోత్సవాలు ఆదివారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఉదయం 7 గంటలకు బిషప్ గ్రాసి ఉన్నత పాఠశాల గ్రౌండ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళావేదికపై బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు, మోన్సిగ్ఞోర్ మువ్వల ప్రసాద్ , పుణ్యక్షేత్రం రెక్టర్ యేలేటి విలియం జయరాజు, వికర్ జనరల్ ఫాదర్ మేశపాం గాబ్రియేలు తదితర గురువులు జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర ్భంగా బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు భక్తులను ఉద్దేశించి సందేశమిస్తూ...2025 సంవత్సరాన్ని జగద్గురువులు పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ వారు జూబ్లీ సంవత్సరంగా ప్రకటించారన్నారు. గుణదలమాత పుణ్యక్షేత్రం అద్భుతాల నిలయంగా విరాజిల్లుతోందని అన్నారు. ప్రత్యేకంగా అలంకరించిన పూజాపీఠంపై ప్రారంభ పవిత్ర దివ్యపూజాబలి సమర్పించారు. పూజ అనంతరం గురువులు మువ్వల ప్రసాద్, పల్లె జోజిబాబు పసల తోమస్ తదితరులు కతోలిక క్రైస్తవ భక్తులకు దివ్య సత్ప్రసాదం అందజేశారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి