Share News

AP Govt : కేటీ ఉజేలా అవినీతిపై విచారణ

ABN , Publish Date - Jan 28 , 2025 | 04:38 AM

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కే త్రిపాఠి ఉజేలాపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

AP Govt : కేటీ ఉజేలా అవినీతిపై విచారణ

  • ఆర్‌పీ సిసోడియాకు బాధ్యతలు

అమరావతి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతను హోంగార్డు ఉద్యోగాల పేరుతో మోసగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కే త్రిపాఠి ఉజేలాపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఆర్‌పీ సిసోడియాను విచారణాధికారిగా, డీజీ ర్యాంకు అధికారి మాదిరెడ్డి ప్రతాప్‌నుప్రభుత్వం తరఫున ప్రజెంటింగ్‌ అధికారిగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఉజేలా 2015 మార్చి నుంచి 2019 జూలై మధ్య కాలంలో ఏపీ హోంగార్డ్స్‌ ఏజీ, ఏడీజీగా పనిచేశారు. ఆ సమయంలో పలు ప్రాంతాల నిరుద్యోగులకు హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఉజేలాతో కలిసి జీవిస్తున్న విజయలక్ష్మి పండిట్‌ ఒక్కొక్కరి నుంచి రూ.7-9 లక్షలు వసూలు చేశారు. ఈ క్రమంలో ఉజేలా గన్‌మెన్‌ల ద్వారా రూ.85 లక్షలు, ఇతరుల ద్వారా మరో రూ.54లక్షలు వసూలు చేశారు. డబ్బులిచ్చిన వారిలో కొంతమందికి ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఉద్యోగాలిచ్చిన ఉజేలా.. చిత్తూరు జిల్లాలో చాలామందికి ఇవ్వలేదు. డబ్బులిచ్చిన వ్యక్తులు ఒత్తిడి చేయడంతో 2022లో తాను హోంగార్డ్సు విభాగంలో లేకపోయినా ఉద్యోగ నియామక పత్రాలిచ్చేశారు. అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు తీసుకుని ఉద్యోగాల్లో చేరేందుకు వెళ్లగా.. అవి నకిలీవని పోలీసు శాఖ తేల్చింది. దీంతో బాధితులు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉజేలాతో కలిసి జీవిస్తున్న మహిళతోపాటు ఆయన తండ్రి మహానంద్‌ త్రిపాఠి.. రూ.52లక్షల వరకూ వసూలు చేసినట్లు విచారణలో తేలింది.


మధ్యవర్తిగా ఉన్న వ్యక్తితోపాటు త్రిపాఠి గన్‌మన్‌ జీవీ రాముడును కూడా విచారించి మొత్తం 8 మందిపై కేసు నమోదు చేశారు. పలువురిని అరెస్టు చేసి ఏడో నిందితుడైన ఉజేలాను కస్టడీకి కోరగా కోర్టు నుంచి అనుమతి లభించలేదు. అయితే ఆధారాలు పక్కాగా ఉండటంతో ప్రభుత్వం 2023 డిసెంబరులో ఉజేలాపై అభియోగాలు నమోదు చేసింది. ఇటీవల ఆయన సహచరులకు డీజీలుగా పదోన్నతి లభించగా త్రిపాఠికి దక్కలేదు. దీనిపై మరోసారి ప్రభుత్వానికి ఆయన విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో వాస్తవాలు తేల్చేందుకు ప్రభుత్వం సిసోడియాను విచారణాధికారిగా నియమించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్‌కు పవన్ అభినందనలు

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 28 , 2025 | 04:38 AM