YSRCP : వైసీపీ ఆఫీసుకి త్వరలోనే తాళాలు
ABN , Publish Date - Sep 05 , 2025 | 08:16 PM
ప్రతిపక్ష హోదా ఇస్తేనే వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తారని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తెలుగుదేశం పార్టీకి గతంలో 23 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ..
అమరావతి, సెప్టెంబర్ 5 : ప్రతిపక్ష హోదా ఇస్తేనే వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తారని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తెలుగుదేశం పార్టీకి గతంలో 23 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అప్పటి జగన్ ప్రభుత్వం ప్రతిపక్ష హక్కులను గౌరవించలేదన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించి రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించారని గోరంట్ల అన్నారు. ప్రజలతో ఒక్కసారి కూడా ఎన్నికకాని సజ్జల ఏ హక్కుతో మాట్లాడుతున్నారు? అని బుచ్చయ్య నిలదీశారు.
జగన్‌కు షాడో సీఎంగా వ్యవహరించి, కొడుకు ద్వారా సోషల్ మీడియాలో 'సైకో ఫ్యాక్టరీ' పెట్టి సజ్జల దుష్ప్రచారం చేశారని బుచ్చయ్య చౌదరి చెప్పారు. రిజిస్ట్రేషన్ లేకుండా, అకౌంట్ లేకుండా కంపెనీలు నడిపామని సజ్జల స్వయంగా ఒప్పుకున్నారని.. మద్యం మాఫియా, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియాల్లో సజ్జల ప్రమేయం వెలుగులోకి వచ్చిందని ఆయన అన్నారు. చంద్రబాబు గారి మీద పెట్టిన ఒక్క కేసు కూడా రుజువు చేయలేకపోయారని బుచ్చయ్య ఎద్దేవా చేశారు.
వైఎస్ జగన్ తన హయాంలో కులం, మతం, బంధువుల ఆధారంగా అధికార గణాన్ని నింపి వ్యవస్థను భ్రష్టుబట్టించారని బుచ్చయ్య చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'తెలుగుదేశం పార్టీ మాత్రమే నిజమైన సామాజిక న్యాయం చేస్తుంది. సజ్జల వల్ల త్వరలోనే వైసీపీ కార్యాలయానికి తాళాలు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. జగన్ కి అసెంబ్లీకి రావడానికి ధైర్యం లేదు. సాక్షి మీడియా ద్వారా మాత్రమే మాట్లాడుతున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను 70 శాతం పైగా అమలు చేసింది. చంద్రబాబు నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ది దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది.' అని బుచ్చయ్య చౌదరి చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమరావతి నష్టపోయింది: పీవీఎన్ మాధవ్
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలు స్ఫూర్తి: సీఎం చంద్రబాబు
Read Latest Andhra Pradesh News and National News