AP News: దగ్గుపాటీ.. నోరు అదుపులో పెట్టుకో.. తేల్చుకుందాం రా..
ABN , Publish Date - Aug 15 , 2025 | 01:06 PM
‘‘దగ్గుపాటీ.. నోరు అదుపులో పెట్టుకో. దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా.. పోటీ చేద్దాం. ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చూద్దాం... అంటూ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సవాల్ విసిరారు.
- మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి
అనంతపురం: ‘‘దగ్గుపాటీ.. నోరు అదుపులో పెట్టుకో. దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా.. పోటీ చేద్దాం. ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చూద్దాం... అంటూ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి(Former MLA Prabhakar Chowdhury) సవాల్ విసిరారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. సమాధులను ఆక్రమించిన వాళ్లు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లు కూడా నన్ను పార్టీ నుంచీ సస్పెండ్ చేయాలని అడిగారని తెలిసింది.
నువ్వు అర్ధరాత్రి టిక్కెట్ తెచ్చుకున్నా నేను కలిసి తిరిగాను. చంద్రబాబు సీఎం కావాలని కష్టపడ్డాను. నీ కోసం కాదు. ఇప్పుడు ప్రెస్‌మీట్ పెట్టి అవాకులు, చవాకులు పేలుతున్నావు. కష్టపడినోళ్లపై బురద చల్లుతావా? మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు నేను అక్రమంగా ఆస్తులు సంపాయించానని అంటున్నావు. రా చర్చ పెట్టుకుందాం. నాకు ఎక్కడ అక్రమాస్తులు ఉన్నాయో లెటర్ ప్యాడ్‌పై రాసివ్వు.
పార్టీ కోసం శ్రమించిన వాళ్లనే స్టేషన్లలో పోలీసుల చేత చితకబాదించింది నిజం కాదా? నీ దుర్నీతిపై ఆధారాలున్నా పార్టీ కోసం మౌనంగా ఉన్నాను. నా ఇంటిని బుల్డోజర్‌తో కొట్టిస్తానంటావా..? నేను తాలిబొట్లు తెంచానంటావా...? రాప్తాడు మర్డర్ కేసులో ముద్దాయి ఎవరు? సీపీఐ రామకృష్ణ మంచి భావాలున్న వ్యక్తి. ఆయనతో నేను మాట్లాడితే తప్పేంటి..? రాత్రి మందు తాగి మాట్లాడే వారెవరో అందరికీ తెలుసు..’’ అంటూ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
నిద్రిస్తున్న చిన్నారిని ఈడ్చుకెళ్లిన చిరుత!
Read Latest Telangana News and National News