Government Land Protection: ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పోరాటం
ABN , Publish Date - Aug 04 , 2025 | 05:22 AM
రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజలు సిద్ధం కావాలని సీపీఐ
ఆర్టీసీ స్థలాలు కార్పొరేట్లకు కట్టబెట్టడం దుర్మార్గం
రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
విజయవాడ (గవర్నర్‌పేట), ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజలు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. విలువైన ప్రభుత్వ స్థలాలను కార్పొరేట్ సంస్థలకు అన్యాక్రాంతం చేయొద్దని, ఆర్టీసీ స్థలాలను లులు కంపెనీకి లీజుకు ఇస్తూ తీసుకొచ్చిన జీవో నెంబరు 137 వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యాన ఆదివారం విజయవాడ దాసరి భవన్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. సమావేశానికి సీపీఐ నగర సమితి కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ చారిత్రక నేపథ్యం కలిగి, కోట్ల రూపాయల విలువచేసే విజయవాడ పాతబస్టాండ్ స్థలంతో పాటు విశాఖపట్నంలో 14 ఎకరాల ప్రభుత్వ భూమిని కార్పొరేట్ సంస్థకు కారుచౌకగా 99 ఏళ్లు లీజుకు కట్టబెట్టడం దుర్మార్గమన్నారు. మాజీ మేయర్ జంధ్యాల శంకర్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్, సీపీఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు పి.ప్రసాద్, లిబరేషన్ నాయకుడు హరనాథ్, ఎన్‌యూసీఐ నేత సుధీర్‌బాబు, కార్మిక సంఘాల నేతలు జీవీ నరసయ్య, ఎండీ ప్రసాద్, వైఎస్ రావు, కేఆర్ ఆంజనేయులు తదితరులు ప్రసంగిస్తూ ఆర్టీసీ స్థలాన్ని లులు సంస్థకు అప్పగించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సుమారు రూ.300 కోట్ల విలువైన విజయవాడ గవర్నర్‌పేట డిపో, పాతబస్టాండ్‌కు చెందిన 4.15 ఎకరాలను లులు కంపెనీకి 99 ఏళ్ల పాటు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవోను తక్షణమే ఉపసంహరించాలని రౌండ్‌టేబుల్ సమావేశం తీర్మానించింది. పౌరవేదిక ఆధ్వర్యంలో ఈనెల 6న జరిగే మహాధర్నాకు మద్దతు ప్రకటించింది.
చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్
తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి