FA 1 Exams: M11 నుంచి ఎఫ్‌ఏ 1 పరీక్షలు
ABN , Publish Date - Aug 07 , 2025 | 04:46 AM
ఫార్మేటివ్ అసె్‌సమెంట్ 1 పరీక్షలను ఈనెల 11వ తేదీ నుంచి నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది
అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ఫార్మేటివ్ అసె్‌సమెంట్-1 పరీక్షలను ఈనెల 11వ తేదీ నుంచి నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 1-5 తరగతులకు 11 నుంచి 13వ తేదీ వరకు, 6-10 తరగతులకు 11 నుంచి 14 వరకు నిర్వహించేందుకు ఎస్‌సీఈఆర్‌టీ షెడ్యూలు విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో జరుగుతున్న తొలి పరీక్షలు ఇవి. రోజూ రెండు పూటలా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం నుంచి విద్యార్థులకు కొత్తగా అసె్‌సమెంట్ పుస్తకాలు అందజేశారు. ఇప్పటివరకూ ప్రతి పరీక్షకు వేర్వేరుగా సమాధాన పత్రాలు ఉండేవి. ఇకపై విద్యార్థులు ఏడాదిలో అన్ని పరీక్షల సమాధానాలను ఒకే పుస్తకంలో రాసేలా అసె్‌సమెంట్ పుస్తకాన్ని రూపొందించారు.
నూతన పాఠ్యప్రణాళికలో భాగస్వామ్యానికి ఆహ్వానం
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయదలచిన నూతన పాఠ్య ప్రణాళిక రూపకల్పనలో భాగస్వాములయ్యేందుకు ఆసక్తి వెల్లడించాలని రాష్ట్ర విద్యా పరిశోధన-శిక్షణ మండలి(ఎ్‌ససీఈఆర్‌టీ) సంస్థలను ఆహ్వానించింది. జాతీయ విద్యా విధానం-2020కు అనుగుణంగా పాఠ్య ప్రణాళిక మారుస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం ఆసక్తి ఉన్న సంస్థలు 1-5 తరగతులు, 6- 10 తరగతులు, ఉపాధ్యాయ వృత్యంతర శిక్షణాభివృద్ధి మూడు కేటగిరీల్లో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది. ఈవోఐ నోట్ పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని, ఈనెల 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఒక పార్టీని టార్గెట్ చేస్తారా.. ఎంపీపై సుప్రీం అసహనం, రూ.10 లక్షల జరిమానా
ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు
For AndhraPradesh News And Telugu News