Share News

Rajahmundry Airport: రాజమండ్రి ఎయిర్‌పోర్టులో ప్రమాదం

ABN , Publish Date - Jan 24 , 2025 | 04:14 PM

Rajahmundry Airport: రాజమండ్రి ఎయిర్‌పోర్టులో కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కొంత మంది కార్మికులు స్టీల్ స్ట్రెక్చర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక స్టీల్ స్ట్రక్చర్ కిందకు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం.

Rajahmundry Airport: రాజమండ్రి ఎయిర్‌పోర్టులో ప్రమాదం
Rajahmundry Airport

రాజమండ్రి, జనవరి 24: రాజమండ్రి విమానాశ్రయంలోని (Rajahmundry Airport) నూతన టెర్మినల్ భవన నిర్మాణంలో ప్రమాదం చోటు చేసుకుంది. క్రెయిన్ వైర్ తెగి టర్మినల్ భాగం కిందపడింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఇటీవల నూతన టెర్మినల్ భవన నిర్మాణాలను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minister Rammohan Naidu) పరిశీలించిన విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజులకే నూతన టెర్మినల్ భవన నిర్మాణం వద్ద ఈ ప్రమాదం జరిగింది.


rajahmundry-ariport1.jpg

రాజమండ్రి ఎయిర్‌పోర్టులో కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కొంత మంది కార్మికులు స్టీల్ స్ట్రెక్చర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక స్టీల్ స్ట్రక్చర్ కిందకు కూలిపోయింది. దీనిపై ఎయిర్‌పోర్టు డైరెక్టర్ జ్ణానేశ్వరరావు ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టు నూతన టెర్మినల్ భవనానికి సంబంధించిన స్టీల్ స్ట్రక్చర్ కొంతభాగం నేలకొరిగిందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయని.. ఇది పెద్ద ప్రమాదమేమీ కాదని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ వెల్లడించారు.

తిరుమల వెళ్లే వారికి అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన తప్పక తెలుసుకోండి


కేంద్రమంత్రి ఆరా..

Rammohan Naidu.jpg

రాజమండ్రి విమానాశ్రయంలో టెర్మినల్ కూలిన ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆరా తీశారు. కేంద్రం తరపున రామ్మోహన్ నాయుడు దావోస్ పర్యటనలో ఉన్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే అక్కడి నుంచే అధికారులతో మాట్లాడారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ, పౌర విమానయాన అధికారులతో మాట్లాడిన కేంద్ర మంత్రి.. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.


కాగా.. రూ.200 కోట్ల వ్యయంతో గత డిసెంబర్ నుంచి ఎయిర్‌పోర్టులో నూతన టెర్మినల్ భవన నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి నూతన టెర్మినల్ భవనాలను పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈరోజు నూతన టెర్మినల్ భవనం నిర్మాణం వద్ద కార్మికులు పనిచేస్తున్న సమయంలో స్ట్రీల్ స్ట్రక్చర్‌కు సంబంధించి ఒక భాగం కిందపడిపోయింది. ఈ ఘటనలో గాయపడిన కార్మికుడిని రాజమండ్రిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. స్ట్రక్చర్ కూలిపోడానికి కారణాలపై, గాయాలపాలైన వారి పరిస్థితి ఏంటి అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

rajahmundry-ariport2.jpg


ఇవి కూడా చదవండి..

డ్రోన్ షో చూసి మంత్రముగ్ధులైన భక్తులు.. ఎక్కడంటే..

అమ్మ ఎక్కడా అని అడిగితే నాన్న మౌనం..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 24 , 2025 | 04:32 PM